డెబ్యూ మూవీకే ఆ హీరోయిన్ రూ.1కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటుందట..!

ఓ హీరోయిన్ మొదటి సినిమా చేస్తుందంటే ఎంత పారితోషికం అందుతుంది… అంటే ఆ ప్రాజెక్టు బట్టి ఉంటుంది. మన తెలుగులో అయితే రూ.6 లక్షల నుండీ రూ.15 లక్షల వరకు ఇస్తారు. పక్క రాష్ట్రాల్లో నుండీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు అయితే రూ.30 లక్షల నుండీ రూ.40 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. చిన్న సినిమాలకు మాత్రం ఇలా ఉండదు. ఇది పెద్ద, మీడియం రేంజ్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్న అంకెలు.

డెబ్యూ మూవీ కనుక హిట్ అయ్యి హీరోయిన్ కు మంచి పేరు వస్తే ఎంతైనా పెంచుకునే అవకాశం ఆ హీరోయిన్లకి ఉంటుంది.తర్వాత తర్వాత ఆ లెక్క కోటి వరకు కూడా వెళ్లొచ్చు. అయితే ఓ హీరోయిన్ మాత్రం మొదటి సినిమాకే ఏకంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. వినడానికే ఈ నెంబర్ షాకింగ్ గా ఉంది కదూ.. ! ఇంతకీ ఎవరా హీరోయిన్? వివరాల్లోకి వెళితే… ‘పృథ్వీరాజ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతోంది మానుషి చిల్లర్.

ఈ బాలీవుడ్ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఈ మూవీలో హీరోయిన్ గా చెయ్యాలి అంటే కోటి రూపాయలు డిమాండ్ చేసిందట మానుషి చిల్లర్. ఆమె చెప్పిన అంకెకు వెనుకాడకుండా నిర్మాతలు అడిగినంత ఇచ్చేశారు.ఇది సినీ చరిత్రలోనే ఓ రికార్డుగా చెప్పుకోవాలి. అయితే మానుషి ఇలా మొదటి సినిమాకే కోటి రూపాయలు డిమాండ్ చేయడం వెనుక ఓ కథ కూడా ఉందట.అదేంటి అంటే.. 2017లో ఈమె మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్.

ఇండియా నుండీ మిస్ వరల్డ్ గా ఎంపికైన 6వ మహిళగా ఈమె చరిత్ర సృష్టించింది. అందుకే ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవాలని చాలా మంది దర్శక నిర్మాతలు ట్రై చేశారు. కానీ మానుషి మాత్రం క్రేజీ ప్రాజెక్టులోనే భాగం కావాలనుకుంది. అందుకే అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ ను ఈమె ఎంపిక చేసుకుంది. జూన్ 3న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus