యమును అంటే ‘మౌన పోరాటం’… ‘మౌన పోరాటం’ అంటే యమున. అంతలా ఆ సినిమాలో టాలీవుడ్‌లో తన పేరును ఫిక్స్ చేసేసుకున్నారు. ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేసినప్పటికీ ‘మౌనపోరాటం’ యమున అంటేనే కిక్ వస్తుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సీరియల్ చేస్తున్నారు ఆమె. ఆ సినిమాలో ఆమె కష్టాలు ఎన్ని పడిందో చూసే ఉంటారు. బయట జీవితంలో కూడా చాలా కష్టాలు పడింది. అయితే అవీ ఇవీ వేర్వేరు అనుకోండి. ఏకంగా కారు మంటల్లో చిక్కుకున్నా బతికి బయటపడ్డారు యమున.
యమును తమిళంలో ఓ సీరియల్‌లో నటించారు. రాధిక రాడాన్ బ్యానర్‌లోని సీరియల్ అది. అందులో అమ్మవారి పాత్ర పోషించారామె. జూన్ 23, 2009 ఈ ప్రమాదం జరిగిందట. కుట్రాలం అనే ప్రాంతంలో షూటింగ్ చేసుకొని తిరిగి టాటా సఫారిలో బెంగళూరు వెళ్తున్నారట. అయితే ఆ దారిలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయట. అలాగే వీళ్లు వెళ్లే కారు కూడా యాక్సిడెంట్ అయ్యిందట. ఎదురుగా బస్సు వెళ్తుండగా, వెనుక నుంచి లారీ యమున కారును ఓవర్‌టేక్ చేసి గుద్దేసిందట. అలా కారును లారీ చాలా దూరం లాక్కెళ్లిందట.
బానెట్, పెట్రోల్ ట్యాంకు పూర్తిగా ఓపెన్ అయిపోయి, కారులో మంటలు వ్యాపించాయట. అయితే అదృష్టవశాత్తు కారుకు సెంట్రల్ లాక్ పడకపోవడంతో మండుతున్న కారు నుండి యమును వెంటనే దూకేశారట. లేకపోతే నా పని అంతే సంగతులు అని చెప్పారు యమున. కారు పూర్తిగా మంటల్లో కాలిపోయిందట. ఆ తర్వాత ఓ సంవత్సరం వరకు ఆ రోజు గుర్తొస్తే భయమేసేదని యమును చెప్పుకొచ్చారు. జీవితంలో ఇన్ని కష్టాలున్నా ఎలా ఇప్పుడు ఆనందంగా ఉంటున్నారు అనడిగితే…
మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి అని చెప్పుకొచ్చారు. కొన్ని సంఘటనలతో ఆర్థికంగా, స్థాయిపరంగా తగ్గిపోయాను. ఇద్దరమ్మాయిలను ఇలాంటి క్లిష్ట సమయంలో పెంచడం సాధ్యమయ్యే పని కాదు. లౌక్యం తెలియక చెప్పిన మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్నా అని కూడా చెప్పారామె. పరిగెత్తడం కన్నా ఉన్నదాంట్లో జాగ్రత్తగా ఉందామని నిర్ణయించుకున్నారట. భయపడితే ముందుకు వెళ్లలేం… భయపడినంతకాలం సమాజం భయపెట్టింది, ధైర్యంగా ఎదురు తిరిగి నవ్వడం మొదలెట్టాను. ఇపుడు చక్కగా ముందుకు వెళ్లగలుగుతున్నాను అంటూ తన ఆనందం సీక్రెట్ గురించి చెప్పారు యమున.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?