Yamuna: ఆ సమయంలో నేను చనిపోదామనుకున్న నటి యమున..!

సౌత్‌ ఇండియాలో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ప్రేక్షకుల అభిమాన తారగా యమున కొనసాగింది. మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఆమె జర్నీ సూపర్‌ స్పీడ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి జరగడం వల్ల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సీరియల్స్ తో యమున బిజీగా ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం `మౌనపోరాటం` అనే సీరియల్‌లో ఆమె నటిస్తుంది.

ఈ సీరియల్‌ టీమ్‌ సుమ యాంకర్‌గా చేస్తే `సుమ అడ్డా`షోకి వచ్చారు. ఇందులో నవ్వులు పూయించారు. కానీ చివరికి తన లైఫ్‌లోని చీకటి రోజులను గుర్తుచేసుకుంది. సుమ ముందు తన గోడు వెల్లబోసుకుంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యింది. అప్పుడు ఏం జరిగిందో తెలిపింది. సుమారు ప‌న్నెండేళ్ల క్రితం ఓ వ్య‌భిచార కేసులో య‌మున ప‌ట్టుబ‌డింది అని వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప్రభావం ఆమె కెరియర్‌పై కూడా పడింది. అయితే దీనిపై య‌మున‌కు న్యాయ స్థానం క్లీన్ చిట్ ఇచ్చింది.

అందులో ఆమెకు (Yamuna) సంబంధించి ఎలాంటి పాత్ర లేదని కోర్టు కూడా స్పష్టం చేసింది. కానీ ఆమెను సోషల్‌మీడియా మాత్రం వదలడం లేదు. ఆమెపై ఇప్పటికీ తప్పుడు థంబ్‌నైల్స్‌ పెట్టి వ్యూస్‌ కోసం కొందరు చేస్తున్న పని వల్ల ఆమెను క్షోభకు గురిచేస్తున్నారు. ‘సోషల్‌ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల నా ఫ్యామిలీలో చాలామంది పక్కన పెట్టేశారు. అవన్నీ భరించలేక చనిపోదామని కూడా నిర్ణయించుకున్న.

అప్పుడు పిల్లలు గుర్తుకొచ్చి ఏం చేసుకోలేకపోయాను.’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయంపై యమున గతంలో కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వార ఒక వీడియో చేసి తన బాధను పంచుకుంది. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది.’ అంటూ తన బాధను వ్యక్తం చేసింది.ఆ థంబ్ నైల్స్ వల్ల నా కుటుంబం నన్ను దూరం పెట్టింది..!

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus