హీరోయిన్ అదా శర్మ హాస్పిటల్ పాలవ్వడం అందరికీ షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. అదా శర్మ డయేరియా అలాగే తీవ్రమైన ఫుడ్ ఎలర్జీకి గురవ్వడంతో హాస్పిటల్ పాలైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్నేహితులు సోషల్ మీడియా, మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు. ప్రస్తుతం అదా శర్మ హాస్పిటల్లోనే వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స తీసుకుంటుంది.సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవర్స్ అంతా ఈ విషయం తెలిసిన వెంటనే టెన్షన్ కి గురవుతున్నారు.
ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.ఆమె నటించిన తాజా మూవీ ‘కమాండో’ ప్రమోషన్స్ లో భాగంగా అదా శర్మ అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుంది. విద్యుత్ జమ్వాల్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ గతంలో వచ్చిన కమాండో 1,2 లకి సీక్వెల్ గా రూపొందినట్లు తెలుస్తుంది. ఇందులో అదా శర్మ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఆమె యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా పాల్గొంది. ఆగస్టు 11 న ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఇక (Adah Sharma) ఆదా శర్మ .. ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. తెలుగులో ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో కూడా నటించింది.