Pushpa2: The Rule: అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌… ఓటీటీకి కొత్త ‘పుష్ప’ పక్కా!

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2 The Rule)  సినిమా విడుదలకు ముందు నుండే నిడివి గురించి చర్చ జరగింది. దర్శకుడు సుకుమార్‌ (Sukumar) మూడున్నర గంటల సినిమా రెడీ చేస్తున్నారని వార్తలొచ్చాయి. దీంతో ఇంత పెద్ద సినిమానా? థియేటర్లలో జనాలు అంతసేపు ఉంటారా? అనే చర్చ కూడా సాగింది. అనుకున్నట్లుగా మూడున్నర గంటల సినిమా రెడీ చేయలేదు కానీ మూడు గంటల 21 నిమిషాల సినిమా అయితే రెడీ చేశారు లెక్కల మాస్టారు. ఇప్పుడు అది ఇంకా పెరుగుతుంది అని టాక్‌.

Pushpa2: The Rule

‘పుష్ప: ది రూల్‌’ సినిమా చూసేటప్పుడు కొన్ని సన్నివేశాలు మిస్‌ అయ్యాయి అనే ఫీలింగ్‌ చాలామందిలో ఉంటుంది. టీజర్‌, ట్రైలర్‌లోని కొన్నిసీన్స్‌, పోస్టర్లలోని పోజులు కూడా సినిమాలో కనిపించలేదు. దీంతో అవి మూడో పార్టు కోసం దాచాశారేమో అని అనుకున్నారంతా. అందులో కొన్ని మూడో ‘పుష్ప’ కోసం ఆపేసినా.. కొన్ని ఎడిటింగ్‌లో భాగంగా లేచిపోయాయి అని టాక్‌ వచ్చింది. ఇప్పుడు ఆ సీన్స్‌ని తిరిగి సినిమాలో యాడ్‌ చేసే పనులు అవుతున్నాయని సమాచారం.

అది థియేటర్లలో సినిమాకు యాడ్‌ చేస్తారా? లేక ఓటీటీలో సినిమా యాడ్‌ చేస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న. సినిమాను జనవరి ఆఖరు వరకు ఓటీటీలోకి తెచ్చేది లేదు అని 56 రోజుల కాన్సెప్ట్‌ను చిత్రబృందం ఇటీవల స్పష్టం చేసింది. ఈ లోపు సినిమాలో అదనపు సన్నివేశాలు యాడ్‌ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే అల్లు అర్జున్‌  (Allu Arjun)  ఆ సన్నివేశాల డబ్బింగ్‌ పనులు షురూ చేశాడు అని చెబుతున్నారు. పని త్వరగా పూర్తయితే ఆ సీన్స్‌ను థియేటర్లలోనే చూపించాలని అనుకుంటున్నారట.

అయితే, ఇప్పటికే రెండు షోల మధ్యలో గ్యాప్‌ సరిపోవడం లేదు. ఈ సమయంలో ఆ సీన్స్‌ కూడా కలిపితే షోల సమయాల్లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఓటీటీలో మాత్రమే ఆ ఎక్స్‌ట్రా సీన్స్‌ చూసే అవకాశం కలుగుతుంది అని అనిపిస్తోంది. చూద్దాం మన లెక్కల మాస్టారి లెక్కేంటో, ఆ సీన్స్‌ కిక్కేంటో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus