Adhurs2: అదుర్స్2 స్టోరీ లైన్ ఇదే.. అక్కడ అల్లరి మామూలుగా ఉండదట!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వి.వి.వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కి 2010 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన అదుర్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ గురించి గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ అదుర్స్2 స్టోరీ సిద్ధమైందని చెప్పుకొచ్చారు. అమెరికాలో చారి, భట్టు చేసే అల్లరితో ఈ సినిమా ఉండనుందని కోన వెంకట్ హింట్ ఇచ్చారు.

అదుర్స్2 (Adhurs2) మూవీ సెట్స్ పైకి వెళ్లాలంటే వినాయక్ నుంచి ఎలాంటి సమస్య లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం అయితే కనిపించడం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదుర్స్2 సినిమా గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. దేవర సినిమాలో అదుర్స్ అనిపించేలా సీన్స్ ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.

దేవర సినిమాలో హీరో విలన్ ఎదురుపడే సినిమాలు మామూలుగా ఉండవని సమాచారం అందుతోంది. దేవర, దేవర2 సినిమాలు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కెరీర్ కు కీలకం కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర మూవీ ఎన్టీఆర్ రేంజ్ ను పెంచుతుందని సోలో హీరోగా తారక్ కోరుకున్న భారీ హిట్ ను ఈ సినిమా అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ ను ఖాతాలో వేసుకోవడంతో పాటు తర్వాత సినిమాలతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. దేవర సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, కొరటాల శివలకు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus