ఆదిరెడ్డి ఫాలోవర్స్ Vs రేవంత్ ఫ్యాన్స్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం అవుతోంది. డిసెంబర్ 18వ తేదిన నాన్ స్టాప్ గా నాలుగున్నర గంటల పాటు ఈ ఫినాలే టెలికాస్ట్ కాబోతోంది. అయితే, ఈసారి చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. లాస్ట్ టైమ్ డిస్నీహాట్ స్టార్ బ్రాండ్ అంబాసిటర్ గా రామ్ చరణ్ సందడి చేశారు. అలాగే, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలియాభట్, రణ్ భీర్ కపూర్ వచ్చారు. నేచరల్ స్టార్ నాని కూడా తన సినిమా ప్రమోషన్ కోసం మరోసారి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో కాసేపు ఫన్ చేశాడు.

ఇప్పుడు ఎవరు గెస్ట్ గా రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, దీనికంటే హాట్ హాట్ గా ఇప్పుడు సోషల్ మీడియా వేడెక్కి పోతూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రేవంత్ ఫ్యాన్స్ కి అలాగే ఆదిరెడ్డి ఫాలోవర్స్ కి మాటల యుద్ధం స్టార్ట్ అయ్యింది. కామెంట్స్ తోనే కొట్టుకుంటున్నారు. ప్రతి ప్రోమో కింద, అలాగే ప్రతి బిగ్ బాస్ వీడియోస్, ట్రోలింగ్స్ కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ లో కొన్ని బూతులు కూడా వినిపిస్తున్నాయి. అసలు మేటర్లోకి వెళితే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ గా ఈసారి రేవంత్ అవుతాడని చాలామంది పక్కాగా చెప్తున్నారు.

రేవంత్ కి ఉన్న ఫాలోయింగ్ వల్ల ప్రస్తుతం ప్రతి నామినేషన్స్ లో సేఫ్ అవుతూ వచ్చాడు. అలాగే, అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో నిలకడగా ఓటింగ్ అనేది పడుతోంది. కాబట్టి ఈసారి విన్నర్ రేవంత్ అంటూ రేవంత్ ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలుపెట్టారు. అయితే, ఇక్కడే రివ్యూవర్ ఆదిరెడ్డి ఫాలోవర్స్ రేవంత్ ఫ్యాన్స్ కి కౌంటర్స్ వేస్తున్నారు. ఆల్రెడీ బిగ్ బాస్ ముందుగానే రేవంత్ ని విన్నర్ అని డిసైడ్ చేశాడని, కావాలనే రేవంత్ కి ఫేవర్ గా వీడియోలు, ప్రోమోలు కట్ చేశారని అంటున్నారు. అంతేకాదు, రేవంత్ బూతులు మాట్లాడినా, వేరేవాళ్లని కామెంట్స్ చేసినా కూడా వాటిని టెలికాస్ట్ చేయలేదని చెప్తున్నారు.

ఆదిరెడ్డి రెండు – మూడు సార్లు మొత్తుకున్నా కూడా ఫుల్ వీడియో వేయకుండా ఇప్పుడు ఫినాలే వీక్ దగ్గరకి వచ్చిన తర్వాత చూపించారని చెప్తున్నారు. కానీ, రేవంత్ ఫ్యాన్స్ మాత్రం ఆదిరెడ్డికి వీడియో చూపించినా కూడా క్లారిటీ రాలేదని, అంతమంది చెప్తున్నా మూర్ఖుడిలా మాట్లాడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున, హౌస్ మేట్స్, ఆడియన్స్ చెప్తున్నా కూడా ఆదిరెడ్డి వినట్లేదని, రేవంత్ ఇంటెన్షన్ అదే అంటూ ఊహించుకుని దానిపైనే మాట్లాడుతున్నాడని అంటున్నారు. అంతేకాదు, ఆదిరెడ్డి కూడా చాలాసార్లు మాటలు తూలాడని, అనవసరంగా రేవంత్ ని రెచ్చగొట్టినా కూడా రేవంత్ ట్రిగ్గర్ అవ్వకుండా మాట్లాడాడు అని గుర్తు చేస్తున్నారు.

రేవంత్ ఫ్యాన్స్ కి అలాగే ఆదిరెడ్డి ఫాలోవర్స్ కి ఇప్పుడు కామెంట్స్ యుద్ధం అవుతోంది. కామెంట్స్ చేస్కుంటూ, కొట్టుకుండూ బూతులు తిట్టుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ ఆదిరెడ్డి మద్యలో నామినేషన్స్ అప్పుడు జరిగిన పాయింట్స్ ని చూపిస్తున్నారు. అంతేకాదు, రేవంత్, అదిరెడ్డి ఇష్యూలో ఫుల్ వీడియో ఉంటే వేయమని బిగ్ బాస్ టీమ్ ని రిక్వస్ట్ చేస్తున్నారు. ముందుగానే రేవంత్ ని విన్నర్ అని డిసైడ్ చేశారని, కావాలనే ఆదిరెడ్డిని తొక్కేస్తున్నారని అభిప్రాయ పడ్డారు. అందుకే, నాగార్జున సైతం “గమీదా” ( గట్టు మీద దాస్ ) అనే స్టోరీ చెప్పి మరీ ఆదిరెడ్డిని తక్కువ చేశారని అంటున్నారు.

ఆదివారం ఎపిసోడ్ లో కూడా నాగార్జున ఆదిరెడ్డికి సెటైర్స్ వేయడాన్ని కూడా తప్పుపడుతున్నారు. మరోవైపు ఆదిరెడ్డిని వచ్చేవారం ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యం లేదని రేవంత్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఏది ఏమైనా వీళ్లిద్దరి కామెంట్స్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇక ఈవారం వీళ్లిద్దరి ఆర్గ్యూమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరం. ఇంకో మేటర్ ఏంటంటే, రేవంత్ తో సరిసమానంగా అన్ అఫీషియల్ ఓటింగ్ లో ఆదిరెడ్డి లేడు. ఇనయా, శ్రీహాన్, రోహిత్ లు ఆదిరెడ్డి కంటే బెటర్ ఓటింగ్ తో ఉండటం కొసమెరుపు. అదీ మేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus