Adi Reddy: మొదటి టాస్క్ లో గెలిచి క్లాస్ లోకి వచ్చిన ఆదిరెడ్డి..! కావాలనే అలా ఆడాడా..!

బిగ్ బాస్ సీజన్ 6లో టాస్క్ ల సందడి మొదలైంది. ఫస్ట్ డే బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని మూడు తరగతులుగా విడిపోమని చెప్పాడు. ఇందులో క్లాస్, మాస్, ట్రాష్ అనే విభాగాలు చేశాడు. క్లాస్ లో ముగ్గురు , మాస్ లో 15మంది, ట్రాష్ లో ముగ్గురు ఉన్నారు. ట్రాష్ లో ఉన్నవారు నేరుగా నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే, ఇక్కడే సమయానుసారం ఛాలెంజస్ వస్తాయని వాటిలో గెలిస్తే మాస్ నుంచీ క్లాస్ కి, అలాగే ట్రాష్ నుంచీ మాస్ కి వెళ్లొచ్చని ఆఫర్ ఇచ్చాడు.

అయితే, ఫిట్టింగ్ కూడా పెట్టాడు. ఇలా టాస్క్ గెలిచినప్పుడల్లా ఒకరు వేరే టీమ్ నుంచీ స్వాప్ అవ్వాలని చెప్పాడు. ఇందులో హౌస్ మేట్స్ ఏకాభిప్రాయం కూడా కలిపాడు. ఇక హౌస్ మేట్స్ చర్చలు మొదలుపెట్టారు. ఇక్కడే కొబ్బరి బోండాల యుద్ధం అనే టాస్క్ ని పంపించాడు బిగ్ బాస్. మాస్ నుంచీ ఆదిరెడ్డి, ట్రాష్ నుంచీ ఇనయ సుల్తానా ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. ఆది రెడ్డి కూల్ గా గేమ్ ఆడుతూ, చక్కని ప్రదర్శనతో విజయం సాధించాడు.

దీంతో ఆదిరెడ్డి క్లాస్ టీమ్ కి ఎగబాకాడు. క్లాస్ లో ఉన్న శ్రీహాన్ మాస్ లోకి వచ్చి చేరాడు. అయితే, సుల్తానాని అందరూ ఆదితో పోరాడినందుకు అభినందించారు. మిగతా వాళ్లు మాత్రం ప్రేక్షకపాత్రని వహించారు. నిజానికి ఆదిరెడ్డి గేమ్ ఎగ్రెసివ్ గా ఆడే అవకాశం ఉంది. కానీ, సుల్తానా నడుంకి తాడు కట్టి ఉండటంతో ఆచి తూచి తను ఇబ్బంది పడకుండా తెలివిగా గేమ్ ఆడాడు. కావాలనే తను కొబ్బరిబొండాం కిందపడకుండా చూసుకుంటూ తోటి పార్టిసిపెంట్ ఇబ్బంది పడకుండా గేమ్ ఆడాడు.

ఫస్ట్ గేమ్ లోనే ఆదిరెడ్డి లాజిక్స్ మాట్లాడుతూ గేమ్ ఎలా ఆడాలో చెప్పే ప్రయత్నం చేశాడు. బిగ్ బాస్ దేనికి స్పందిస్తాడో, దేనికి స్పందించడో బాలాదిత్యకి చెప్పే ప్రయత్నం చేశాడు. క్లాస్ నుంచీ ఎవరు స్వాప్ అవ్వాలనే ఆర్గ్యూమెంట్ వచ్చినపుడు ఆదిరెడ్డిని ఒకరిని సెలక్ట్ చేయమని బాలాదిత్య చెప్పాడు. అలా నేను చేయను అని, మీరే ఏకాభిప్రాయంతో చేయాలని సూటిగా చెప్పాడు. ఇక్కడే తన తెలివిని వాడి గేమ్ లో ఒక మెట్టు ఎక్కి క్లాస్ బాల్కనీని ఆస్వాదించాడు ఆదిరెడ్డి.

క్లాస్ టీమ్ బాల్కనిలోని సకల సౌకర్యాలని అనుభవించవచ్చు. అంతేకాదు, హౌస్ లో ఎలాంటి పని చేయాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా క్లాస్ టీమ్ లో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. అందుకే, ఇప్పుడు మాస్ టీమ్ లో ఉన్నవాళ్లు క్లాస్ టీమ్ లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొన్ని ఛాలెంజస్ వస్తేనే కానీ, నామినేషన్స్ లో ఎవరు ఉన్నారు అనేది తెలియదు.

బిగ్ బాస్ 6 కంటెస్టంట్స్ లిస్టు

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus