ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పిన ఆదిశేషగిరిరావు!

  • November 21, 2022 / 06:17 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. కార్డియాక్‌ అరెస్టుతో మల్టిపుల్‌ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ అయ్యిందని వైద్యులు చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని వైద్యులు చెప్పారు. అయితే అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అభిమానులు అనుకుంటున్నారు. దీంతో కృష్ణ చనిపోవడానిక ముందు ఏం జరిగింది అనే విషయంలో అభిమానుల ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు మాట్లాడారు.

చనిపోవడానికి కృష్ణ ఎలా ఉన్నారు, ఏం మాట్లాడారు, తర్వాత ఏమైంది అనేది ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందు ఆదివారం పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వచ్చారట. దాదాపు రెండు గంటలకు పైగా అక్కడే ఉన్నారట. చిన్నప్పటి సంగతులు చాలా చెబుతూ వ‌చ్చారు. సైకిల్‌ ఇద్దరూ సినిమాలకు తీసుకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు చెబుతుంటే ఇద్దరూ బాగా నవ్వుకున్నారట. ఎప్పటిలాగే సినిమాల‌ గురించి కూడా చర్చించుకున్నారు.

అయితే ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు కనిపించలేదని ఆదిశేషగిరి రావు చెప్పారు. ఆ సమయంలో కృష్ణ చాలా హుషారుగా కనిపించారట. ఇంట్లోనే భోజం చేసి వెళ్లు అని కృష్ణ అడిగినప్పటికీ.. వేరే వాళ్లు ఇంటికి భోజనానికి వస్తున్నారు అని చెప్పాను. దీంతో మరోసారి లంచ్‌కి రా అని అన్నారు. దాంతో ఇంటికి వచ్చేశాను అని ఆదిశేషగిరిరావు తెలిపారు. అయితే ఆ రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయాక అన్నయ్యకి రాత్రి 12.30కి గుండెపోటు వచ్చింది అని చెప్పారు ఆదిశేషగిరి రావు.

అన్నయ్య గది నుండి గురక శబ్దం వినబడకపోయేసరికి ఆయన అవసరాలు చూసుకునే కుర్రాడు అనుమానం వచ్చి పల్స్‌ చెక్‌ చేశాడు. అయితే ఏదో తేడాగా అనిపించేసరికి.. నాకు ఫోన్‌ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పాను. ఆ తర్వాత నేను కూడా వెళ్లా. అయితే గుండెపోటు వచ్చి అప్పటికే 30 నిమిషాలు దాటిపోయిందట. దాంతో ఆ ప్రభాం అవ‌య‌వాల మీద ఆ ప్ర‌భావం ప‌డింది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా ఆగిపోయింది. దీంతో వైద్యులు 30 గంటలకుపైగా వైద్యం చేశారు. కానీ ఫలితం లేకపోయింది అని ఆదిశేషగిరిరావు చెప్పారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus