Adipurush Trailer: ‘ఆదిపురుష్’ రిలీజ్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

‘ఆదిపురుష్’.. ప్రభాస్ నటించిన మొదటి మైథలాజికల్ మూవీ.అలాగే అతను బాలీవుడ్లో చేసిన మొదటి స్ట్రైట్ మూవీ ఇది. తానాజీ వంటి చిత్రాన్ని అందించిన ఓం రౌత్ దర్శకుడు. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి స్పందన లభించింది. దీంతో జూన్ 16 న విడుదల కాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే కొద్దిసేపటి క్రితం రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ అయ్యేలా చూసుకున్నారు.

శ్రీరాముని కథ అందరికీ తెలిసిందే. అయితే అందులో చాలా నీతి ఉంటుంది. శ్రీరాముని జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. అందరూ తెలుసుకోవాలి కూడా..! అందుకు ‘బాహుబలి’ వంటి ప్రభాస్ ను తీసుకోవడం అనేది దర్శకనిర్మాతల తీసుకున్న గొప్ప నిర్ణయమని చెప్పాలి. ఇక ఈ రెండో ట్రైలర్లో బాగా హైలెట్ అయినవి విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు. చాలా మంచి డైలాగులు కూడా ఉన్నాయి. ట్రైలర్ ను ఓసారి చూడండి. డైలాగులు కూడా మీకోసం :

1)వస్తున్నా రావణ.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి
వస్తున్నా నా జానకిని తీసుకువెళ్ళడానికి

2)నా ఆగమనం .. అధర్మ విద్వంసం

3)ఈరోజు నాకోసం పోరాడొద్దు.. భరతఖండంలో పరస్త్రీ మీద చేయి వేయాలనే దుష్టులకి మీ పాషా పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి. పోరాడతారా?

4)అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయధ్వజాన్ని పాతండి

5)మీరు నాతో వచ్చేయండమ్మా..!

6)తను ఇంటి గుమ్మంలో నుంచి ఎత్తుకువచ్చాడు, జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకెళ్లినప్పుడే..! ఆయనే వస్తారు.!

7))నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ.. నీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశుడనై ఉన్నాను

8)ఈ దశకంఠుడు పది మంది రాఘవుల కన్నా ఎక్కువ

9) పాపం ఎంత బలమైనదైనా అంతిమ విజయం సత్యానిదే

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus