Prabhas: అభిమానులకు ప్రభాస్ సర్ప్రైజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా ఎలా ఉంటారో చూడాలని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ప్రభాస్ ఆదిపురుష్ లో పోషిస్తున్నారు. అయితే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం.

వచ్చే నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కాగా రామావతారంలో ప్రభాస్ లుక్ ను ఆరోజు రిలీజ్ చేయాలని ఆదిపురుష్ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, కృతిసనన్ కాంబినేషన్ లో ఆదిపురుష్ తొలి సినిమా కావడం గమనార్హం. ఈ ఏడాది చివరినాటికి ఆదిపురుష్ షూటింగ్ పూర్తి కానుంది. దర్శకుడు ఓం రౌత్ వేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.

ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ పనులు పూర్తైన తర్వాత ప్రాజెక్ట్ కె సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం. ప్రభాస్ కు ఆదిపురుష్ సినిమా తర్వాత బాలీవుడ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus