Adipurush Release Date: దేశం గర్వించే సినిమా చేస్తున్నాం.. టైమ్‌ పడుతుంది!

ప్రభాస్‌ అభిమానులు భయపడినట్లే జరిగింది. చాలా రోజులుగా పుకార్లు మాత్రమే వినిపిస్తూ వచ్చిన ‘ఆదిపురుష్‌’ వాయిదా.. ఇప్పుడు నిజమైంది. ఇన్నాళ్లూ ఉదయాన్నే పోస్టర్లు, టీజర్ల అప్‌డేట్లు ఇస్తూ ప్రేక్షకుల్ని, ప్రభాస్‌ అభిమానుల్ని ఆనందపరిచిన టీమ్‌.. ఈ రోజు వాయిదా వార్త చెప్పి నిరాశకు గురి చేసింది. ఈ మేరకు టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో సినిమా కొత్త విడుదల తేదీని చెప్పడంతోపాటు, సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది అనే విషయం కూడా తెలియజేసింది.

సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న ‘ఆదిపురుష్‌’ను విడుదల చేస్తామని గతంలో టీమ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటకొస్త సంక్రాంతి రేసులో నిలిచిన తొలి సినిమా ఇదే. అయితే ఇప్పుడు వివిధ కారణాల వల్ల సినిమాను వాయిదా వేయాలని టీమ్‌ డెసిషన్‌ తీసుకుంది. జూన్‌ 16, 2023న సినిమాను విడుదల చేస్తామని స్పెషల్‌ నోట్‌ విడుదల చేసింది. అయితే శ్రీరామనవమి కానుకగా ఈ సినిమా మార్చి ఆఖరున వస్తుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే టీమ్‌ ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకుంది.

‘ఆదిపురుష్‌’ అనే కేవలం సినిమా కాదు. రాముడి పట్ల మన భక్తిభావం చూపించే చిత్రం. మన సంస్కృతి, చరిత్ర విషయంలో మన కమిట్‌మెంట్‌ చూపించే ప్రయత్నం. అలాంటి సినిమాను విజువల్‌గా అద్భుతంగా చూపించాలి అంటే ఇంకాస్త సమయం కావాలి. అప్పుడే టీమ్‌ సినిమాను ఇంకా చక్కగా తీర్చిదిద్దుతుంది. అందుకే సినిమా విడుదలను వచ్చే ఏడాది జూన్‌ 16కు వాయిదా వేస్తున్నాం’’ అంటూ టీమ్‌ ఆ ప్రకనటలో పేర్కొంది.

దీంతోపాటు మన దేశం గర్వపడే సినిమా తెరకెక్కించడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో మేం ముందుకెళ్లడానికి మీకు సహాయం, ప్రేమ, ఆశీస్సులు మాపై ఉండాలి అని కూడా రాసుకొచ్చింది టీమ్‌. దీంతో సంక్రాంతి వార్‌ చిరంజీవి, బాలకృష్ణ, విజయ్‌, అఖిల్‌ మధ్యనే ఉండబోతోంది అని చెప్పొచ్చు. అయితే ఇందులో మరో రెండు సినిమాలు తప్పుకోవచ్చని టాక్‌. ఇక ‘ఆదిపురుష్‌’ టీజర్‌ విషయంలో వచ్చిన విమర్శలే ఈ వాయిదాకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus