Adipurush: ఆ చెత్త రికార్డ్ ను ఆదిపురుష్ సొంతం చేసుకుంటుందా?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఒకింత నెగిటివిటీ ఉంది. ఈ సినిమా షూటింగ్ వేగంగానే పూర్తైనా ఈ సినిమా టీజర్ విషయంలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మేకర్స్ చెప్పిన బడ్జెట్ కు టీజర్ క్వాలిటీకి ఏ మాత్రం పొంతన లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం.

ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు జూన్ సమయానికి కూడా పూర్తి కావని సమాచారం. క్వాలిటీ గ్రాఫిక్స్ లేకపోతే శాటిలైట్, డిజిటల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యే అవకాశం ఉండదు. ఈ కారణం వల్లే ఆదిపురుష్ మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదిపురుష్ జూన్ లో కూడా రిలీజ్ కాదనే వార్త ఫ్యాన్స్ కు షాకిస్తోంది.

ఆదిపురుష్ సినిమాలో నటించి ప్రభాస్ తప్పు చేశాడని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ షూట్ మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు పాజిటివ్ గా ఏదీ జరగలేదు. అన్నీ నెగిటివ్ గానే జరుగుతుండటంతో ప్రభాస్ సైతం ఈ సినిమా విషయంలో ఒకింత హర్ట్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఆదిపురుష్ మూవీ కంటే సలార్ మూవీనే ముందు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ సినిమాలన్నీ వేర్వేరుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రభాస్ ఒక్కో ప్రాజెక్ట్ కు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus