ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్లో ప్రభాస్ చేసిన స్ట్రెయిట్ మూవీ ఇది. జూన్ 16 న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రామాయణంనే మళ్ళీ తీసినా.. అపహాస్యం చేశారు అనే ముద్ర పడింది. సినిమా అంతా డార్క్ మోడ్ లో ఉండటం, హాలీవుడ్ సినిమా లోకేషన్లను తీసుకొచ్చి మైథలాజికల్ సినిమాలో ఇరికించడం విమర్శలపాలయ్యేలా చేసింది అని చెప్పొచ్చు.
మరీ ముఖ్యంగా రావణలంకని హాలీవుడ్ సినిమాల్లో కనిపించే బిల్డింగ్ లలో పెట్టేసి, రావణుడి వాహనాన్ని గబ్బిలంగా పెట్టడం, మళ్లీ శాకాహారి అయిన రావణాసురుడితో తన వాహనానికి మాంసాహారం తినిపించడం, అలాగే పాములతో రావణాసురుడు మసాజ్ చేయించుకోవడం, సీతా దేవి సిల్క్ చీరలు ధరించడం ఇలా చాలా అంశాలు జనాలకి చిరాకు తెప్పించాయి. అందుకే ఇవి కోర్టు కేసుల వరకు దారి తీశాయి. భవిష్యత్తరాలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటూ సుప్రీంకోర్టు కూడా ఆడిపురుష్ మేకర్స్ కి చివాట్లు పెట్టింది.
ఇక ఈ చిత్రాన్ని (Adipurush) థియేటర్లలో వీక్షించడానికి చాలా మంది లైట్ తీసుకున్నారు. ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చాలా సైలెంట్ గా ఆదిపురుష్ అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమైంది. సో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇక్కడ చూడొచ్చు. హిందీ, తెలుగుతో పాటు మలయాళ , కన్నడ , తమిళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇక్కడ ఆదిపురుష్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.