బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇతర కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున ఈ టీజర్ పై విమర్శలు వచ్చాయి.
ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాగాలేవు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఈ టీజర్ కన్నా కార్టూన్ ఛానల్ అద్భుతంగా ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ టీజర్ లో లోపాలను వెతుకుతూ చాలామంది వివాదాలకు తెర తీస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతలు కూడా ఈ టీజర్ పై స్పందిస్తూ వెంటనే అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇలా ఎన్నో వివాదాలను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ టీజర్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది.ఇక ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టడం విశేషం.ఈ విధంగా అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన తొలి ఇండియన్ సినిమాగా ఈ సినిమా టీజర్ రికార్డ్ సొంతం చేసుకుంది.
త్రీడీ ఫార్మేట్ లోవిడుదలైన ఈ టీజర్ ఒకవైపు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ మరోవైపు ఎంతో మందిని ఆకట్టుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇక ఈ సినిమా ప్రస్తుతం ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా కృతి సనన్ సీతమ్మ పాత్రలో సందడి చేయనున్నారు.