బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం ముగ్గురు పోటీపడ్డారు. బిడ్ ని ఓకే చేసి బజర్ నొక్కి ఫైమా, రేవంత్, శ్రీహాన్ టాస్క్ సెకండ్ లెవల్ కి వెళ్లారు. ఇక్కడే బిగ్ బాస్ వీళ్లకి లాగ్ వార్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా మిగతా హౌస్ మేట్స్ బజర్ వచ్చినప్పుడల్లా ఇసుక బస్తాలని తీస్కుని వచ్చి పార్టిసిపెంట్స్ లాగ్స్ పై వేయచ్చు. ఎవరికైతే మద్దతు ఇస్తున్నారో క్లారిటీగా చెప్పచ్చు. ఇక్కడే ఆదిరెడ్డి రేవంత్ ని టార్గెట్ చేశాడు. తనని కెప్టెన్సీ టాస్క్ నుంచీ శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ కలిసి అవుట్ చేశారని మనసులో పెట్టుకుని మరీ రేవంత్ గేమ్ ని తప్పుబట్టాడు.
కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ట్రక్ టాస్క్ ఆడేటపుడు శ్రీసత్య, శ్రీహాన్ ఇద్దరిలో ఒకరికి ఓట్ వేయాల్సి వచ్చినపుడు నువ్వు అమ్మాయి కాబట్టి శ్రీసత్యని తీస్కుందామని చెప్పావ్ అంటూ ఆదిరెడ్డి లాజిక్ మాట్లాడాడు. అమ్మాయి కాబట్టి ఈజీగా గెలవచ్చని చెప్పావ్, అలాగే కెప్టెన్సీ టాస్క్ లో ఇనాయాపై గెలిచినపుడు ఇనాయా బాధపడుతుంటే మాత్రం శ్రీహాన్ ని లాస్ట్ వరకూ ఉంచి టఫ్ ఫైట్ ఇవ్వాలనుకున్నా, అమ్మాయి కాబట్టి నిన్ను ఎలిమినేట్ చేశా అనే రీజన్ చెప్పావ్ అంటూ రెచ్చిపోయి ఆర్గ్యూ చేశాడు. ఈవిషయంలో రోహిత్ కూడా ఉన్నాడంటూ ఒక సాక్ష్యం తెచ్చాడు ఆదిరెడ్డి.
దీనికి రేవంత్ ఆ వీడియో చూపించమను, నేను ఏ ఉద్దేశ్యంతో చెప్పానో తెలుస్తుందంటే, అది తప్పు అయితే మాత్రం ఇంట్లో నుంచీ నేను వెళ్లిపోతా, నువ్వు వెళ్లిపోతావా అంటూ ఆదిరెడ్డి సవాల్ విసిరాడు. ఆ తర్వాత కూడా రేవంత్ ని ఎక్కడా మాట్లాడనివ్వలేదు. తను మాట్లాడుతుంటే మద్యలో దూరద్దంటే నేను దూరతాను అని, నువ్వు అనని మాటలు కూడా చెప్తున్నావంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కాసేపు వాదించికున్నారు. ఆ తర్వాత కూడా ఆదిరెడ్డి ఇసుక బస్తాని తెచ్చిశ్రీహాన్ కి వేశాడు. తనకి ఓటు వేసాడనే రీజన్ మాత్రమే చెప్పాడు. తర్వాత మరోసారి ఇసుక బస్తాని రేవంత్ కి వేశాడు ఆదిరెడ్డి.
ఇలా మూడుసార్లు ఆదిరెడ్డి ఇసుక బస్తాని దక్కించుకున్నాడు. దీంతో బిగ్ బాస్ మూడుసార్లు కంటే ఎక్కువ ఎవరూ వేయకూడదని రూల్ పంపించాడు.అయితే, రేవంత్ తను ఏమన్నాడు అనేది క్లియర్ గా చెప్పాడు. సమవుజ్జీ అవుతారని చెప్పా, అది చెప్పకుండా మిగతాది చెప్పాడని, నేను అన్న మాటని పూర్తిగా చెప్పకుండా సగం ముక్క తీసుకుని వచ్చి చెప్తున్నాడని శ్రీహాన్ తో అభిప్రాయపడ్డాడు. అలాగే, ఆడవాళ్లు, మగవాళ్లు గేమ్ లో సమానం అని అన్నారు కదా బ్రో అంటే., నువ్వు అనలేదు కదా అంటూ ఆదిరెడ్డి రెచ్చిపోయాడు. నిన్ను నేను అనలేదు, మద్యలో దూరకు అంటే నేను దూరతా అంటూ వాదన పెట్టుకున్నాడు.
కావాలనే ఇక్కడ రేవంత్ ని టార్గెట్ చేశాడా అనిపిస్తోంది. ఎందుకంటే, కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన కోపం ఇంకా ఆదిరెడ్డిలో అలాగే ఉంది. మార్నింగ్ రేవంత్ వచ్చి ఆదిరెడ్డితో జోక్ వేస్తున్నా కూడా ముభావంగానే ఉన్నాడు. ఇక అసలు సిసలైన ఎవిక్షన్ ఫ్రీపాస్ ని చివరి వరకూ ఉన్న ఫైమా దక్కించుకుంది. ఈ పాస్ ని తను ఎవరికోసం వాడుతుందనేది చూడాలి. ఈవారం కెప్టెన్ ఫైమా కాబట్టి నామినేషన్స్ లో లేదు. ఆ తర్వాత రేవంత్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి వచ్చేవారం తనకి ఇమ్యూనిటీ లభించింది. ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా టాప్ 5 దిశగా దూసుకుపోతున్నారు. అదీ మేటర్.