Adiseshagiri Rao: కృష్ణ అంత్యక్రియల విమర్శలపై స్పందించిన ఆదిశేషగిరిరావు

దివంగత టాలీవుడ్ స్టార్ హీరో ఘట్టమనేని కృష్ణ గత ఏడాది నవంబర్ లో మరణించిన సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన ఆర్గాన్స్ దెబ్బ తినడంతో హాస్పిటల్ లో .. చికిత్స పొందుతూనే ఆయన మరణించడం జరిగింది. ఇక కృష్ణ గారి అంత్యక్రియలు హైదరాబాద్‌లో ఉన్న మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.కృష్ణ వంటి నెంబర్ వన్ హీరో అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయడం ఏంటి? అని మహేష్ ను ఘోరంగా ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మహేష్ బాగా డబ్బున్న వారిలో ఒకరు.

తన తండ్రికి ఓ స్థలం కొని అక్కడ అంత్యక్రియలు చేయలేడా.. ప్రభుత్వం వారు ఇచ్చిన స్థలంలో చేయాలా అని హార్డ్ కొర్ కృష్ణ ఫాన్స్ మహేష్ ను తిట్టిపోశారు.సీనియర్ ఎన్టీఆర్ అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం సాయం అందించింది. ఇక ఏఎన్నార్ అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించారు నాగార్జున. శోభన్ బాబు అంత్యక్రియలు చెన్నైలోని ఆయన ఫామ్ హౌస్ లో జరిగాయి. కృష్ణంరాజు అంత్యక్రియలు కూడా ఆయన ఫామౌస్ లో జరిగాయి. హరికృష్ణ అంత్యక్రియలు కూడా ఆయన ఫామౌస్ లో నిర్వహించారు కళ్యాణ్ రామ్.

అన్నీ ఎలా ఉన్నా కృష్ణ పార్థీవ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో కూడా పెట్టలేకపోయారు అనే విమర్శలు మహేష్ పై ఎక్కువగానే పడ్డాయి. తాజాగా వీటికి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఈ విషయంపై స్పందిస్తూ.. “కృష్ణ పార్థివదేహం వద్ద ఎవ్వరూ లేరు, ఒంటరిగా వదిలేశారు అనే ఆరోపణలు, విమర్శలు చాలా వచ్చాయి. అదంతా అబద్ధం. నా కొడుకు, మేనల్లుడు సహా చాలా మంది అక్కడ ఉన్నారు. అలాగే కృష్ణ పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తీసుకువెళ్లకపోవడానికి కారణం అప్పటికే ఆలస్యమవ్వడంతో పాటు బాగా మంచు పట్టడం కూడా ఓ కారణం.

కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేసినందుకు కూడా విమర్శలు వచ్చాయి. అందుకు కూడా అదే కారణం. అయితే పద్మాలయ స్టూడియో వద్ద ఒక మెమోరియల్ నిర్మిస్తున్నాము. ఈ మెమోరియల్‌కు సంబంధించి మహేష్ బాబు ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. అలాగే, కృష్ణ సొంతూరు బుర్రిపాలెం గ్రామంలో ఆయన పేరిట ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తున్నాం” అంటూ (Adiseshagiri Rao) ఆదిశేషగిరిరావు చెప్పుకొచ్చారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus