Adivi Sesh: ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఏడ్చేసాను.. శేష్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా నటించిన మేజర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం అనంతరం శేష్ నటించిన హిట్ 2 సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో తాను నటించిన మేజర్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో చిత్ర బృందం మొత్తం ఎంతో ఇబ్బందులు పడ్డామని ఆ సమయంలో ఏం చేయాలో తెలియక తనకు ఏడుపు వచ్చిందని ఈ సందర్భంగా శేష్ అప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. మేజర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కోసం ఒక స్టూడియోలో భారీ సెట్ వేసాం అయితే ఆ లొకేషన్లో బాలీవుడ్ సినిమా షూటింగ్ జరుపుకోవాల్సి ఉండగా స్టూడియో వాళ్ళు మేజర్ సెట్ కూల్చేస్తామని తమకు వార్నింగ్ ఇచ్చారు.

ఆ సమయంలో ఏం చేయాలో తెలీక చాలా బాధపడ్డామని తెలిపారు. ఈ సినిమాలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఒక సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో తాను అస్వస్థతకు గురయ్యానని అందుకే క్లైమాక్స్ సన్నివేశాలు కాస్త ఆలస్యం అయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే స్టూడియో వాళ్ళు తమ సినిమా సెట్ మొత్తం తీసేస్తామని చెప్పడంతో కంగారుపడ్డాము.

ఇక తమకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో డైరెక్టర్ శశికిరణ్ తన వద్దకు వచ్చి ఇదే ఎమోషన్స్ ను అక్కడ కంటిన్యూ చేయని చెప్పారు. ఇలా అతి తక్కువ సమయంలోనే ఎనిమిది సన్నివేశాలను కూడా చిత్రీకరించి షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేశామని శేష్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus