Adivi Sesh: ‘మేజర్’ ట్రైలర్ లాంచ్ లో అడివి శేష్ కామెంట్స్ వైరల్..!

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ జూన్ 3న విడుదల కాబోతుంది.2011వ సంవత్సరంలో ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణ త్యాగం చేసిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రమే కాకుండా అతని లక్ష్యమేమిటి? అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉండేది? అతని ధైర్య సాహసాలు ఎలా ఉండేవి వంటి పాయింట్స్ ను ఈ మూవీలో చూపించబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేసింది.

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. అడివి శేష్ మాట్లాడుతూ.. ” ‘మేజర్’ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మ్యాన్. అమ్మ, నాన్న, స్నేహితులు, చైల్డ్ హుడ్ క్రష్, గర్ల్ ఫ్రెండ్ ఇలా మనందరిలానే అతని జీవితం కూడా సింపుల్ గా ఉండేది. ఐతే అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారనేది ‘మేజర్’ లో చూస్తారు. మహేష్ గారు ‘మేజర్’ సినిమాకి బ్యాక్ బోన్ లా నిలిచారు.

ఏం జరిగినా మహేష్ గారు ఉన్నారనే ఒక నమ్మకం. కోవిడ్ లాంటి కష్టకాలంలో మహేష్, నమ్రత గారు మమ్మల్ని నిలబెట్టారు.మాకు అండగా నిలబడ్డారు. అబ్బూరి రవి గారికి కూడా స్పెషల్ థాంక్స్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కోరిక ఒక్కటే. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవాలని.! ‘మేజర్’ మూవీ సందీప్ ఉన్నికృష్ణన్ కు గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ‘మేజర్’ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus