Adivi Sesh: అఖీరాతో బాండింగ్ పై అడివి శేష్ కామెంట్స్..!

అడివి శేష్ నటించిన ‘మేజర్’ చిత్రం ఈ వారం అంటే జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఇప్పటికే కొన్ని ఏరియాల్లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.షో చూసిన వారంతా కన్నీళ్లతో బయటకు వచ్చారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ను మించి ఈ చిత్రం హిట్ అవుతుందనే కామెంట్స్ కూడా వినిపించాయి. ముంబై, పుణె వంటి సిటీల్లో ‘మేజర్‌’ ను ప్రదర్శించారు. వైజాగ్‌లో కూడా స్పెషల్ షో వేయడం జరిగింది.

షో అయ్యాక అడివి శేష్ అక్కడి మీడియాతో ముచ్చటించడం కూడా జరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా స్పెషల్ షో వేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది అడివి శేష్ కు. అందుకు అతను ఆయన ఎప్పుడు అంటే అప్పుడు షో వేయడానికి రెడీగా ఉన్నాం అంటూ సమాధానమిచ్చాడు. పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ చిత్రం ద్వారానే పాపులర్ అయ్యాడు అడివి శేష్. ఆ చిత్రం కథ మొత్తం అడివి శేష్ పాత్ర కారణంగానే మలుపు తిరుగుతుంది.

అందుకే అడివి శేష్ కు మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత ‘బాహుబలి’ వంటి సినిమాలు శేష్ ఇమేజ్ ను పెంచాయి. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ గురించి అడివి శేష్ మాట్లాడుతూ.. 10 ఏళ్ళలో 3 సార్లు మాత్రమే ఆయన్ని కలిశాను, ఆయన్ని నేను ఆరాధిస్తుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అఖీరా నందన్ మాత్రం అతనికి మంచి ఫ్రెండ్ అని చాలా క్లోజ్ అని చెప్పుకొచ్చాడు.

శేష్- అఖీరా లు కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటారని, శేష్ సినిమాలంటే అఖీరాకి చాలా ఇష్టమని రేణూ దేశాయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక మేజర్ చిత్రం ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో మరణించిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో రూపొందింది. మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్ లో కూడా మహేష్ చురుగ్గా పాల్గొంటున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus