Adivi Sesh: ప్రేమలో విఫలమయ్యాను.. ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను!

విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎన్నో మంచి విజయాలను అందుకుంటున్న నటుడు అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆయన మేజర్ చిత్రం ద్వారా జూన్ 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో అడివి శేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన తన వృత్తి పరమైన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.గత పది సంవత్సరాల నుంచి చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన మేజర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక మేజర్ సినిమాతో తాను సందీప్ ఉన్నికృష్ణన్ కి పెద్ద అభిమానిగా మారిపోయానని తెలిపారు. అడవి శేష్ తల్లిదండ్రులు అమెరికాలోని నివసిస్తున్నారు.

అయితే తనకు అమెరికాలో ఉండటం కన్నా ఇండియాలో ఉండడమే ఇష్టమని అందుకే తను ఇక్కడే ఉంటున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉన్నప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించగా మంచులక్ష్మి లాగా తెలుగు మాట్లాడితే నన్ను కూడా తిడతారని ఎంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక పెళ్లి గురించి ప్రస్తావన రాగా పెళ్ళెప్పుడు అని ప్రశ్నించడంతో ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలో తన కన్నా ఎంతో పెద్ద వాళ్ళు ఉన్నారు.

సల్మాన్ ఖాన్ వంటి వారందరూ ముందు పెళ్లి చేసుకున్న తర్వాత తను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. మరి సల్మాన్ ఖాన్ మాదిరి మీకు కూడా ఏవైనా ఎఫైర్స్ ఉన్నాయా.. అని ప్రశ్నించగా ఆ హీరోలా తనకు ఎలాంటి ఎఫైర్స్ లేవని,అయితే అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అయితే తన పుట్టిన రోజు ఆ అమ్మాయి పెళ్లి జరగడం చాలా బాధేసిందని, ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనని శేషు ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus