Adivi Sesh: ఐదు భాషలలో రానున్న గూడచారి సీక్వెల్.. శేష్ ప్లాన్ మామూలుగా లేదుగా?

శశికిరణ్ తిక్క దశకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం గూడచారి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని హీరో అడివి శేష్ కి మంచి పేరు తీసుకు వచ్చింది. ఇకపోతే తాజాగా ఈయన శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడంతో అడవి శేష్ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈయన హిట్ 2సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది ఈ క్రమంలోనే అడివి శేష్ గూడచారి సినిమా సీక్వెల్ చిత్రాన్ని చేయబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి కూడా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.2018లో విడుదలైన గూడచారి సినిమా మంచి విజయం సాధించడంతో శశికిరణ్ ఈ సినిమా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద స్థాయిలో మంచి విజయాన్ని సాధిస్తే హీరో అడివి సైతం పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా గూడచారి సీక్వెల్ లో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు.ఇప్పటికే మేజర్ సినిమాతో స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ఈయన ఈ సినిమాతో మరో హిట్ కొడితే దేశవ్యాప్తంగా ఈ హీరో పేరు మారుమోగిపోతుందని చెప్పాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus