Adivi Sesh: పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయిన అడివి శేష్?

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి అద్భుతమైన విజయాలను అందుకుని తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈ విధంగా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మేజర్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. ఇలా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు రావడమే కాకుండా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇతర భాషలలో కూడా అడివి శేష్ నటన తీరు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అడవి శేష్ క్షణం సినిమా నుంచి మేజర్ సినిమా వరకు ఎంతో విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని, కథకు అనుగుణంగా తనను తాను పెద్ద ఎత్తున మార్పులు చేసుకొని సినిమాలలో ఒదిగిపోయి నటిస్తున్నారు. ఇలా వచ్చిన వరుస సినిమా అవకాశాలలో నటించకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రతి ఒక్క సినిమాతో విజయాన్ని అందుకుంటున్నారు.

స్టార్ డైరెక్టర్ ల సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఈయన నటనా నైపుణ్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇతర భాషలలో కూడా ఈ సినిమాకి మంచి రివ్యూలు రావడంతో ఫ్యూచర్లో అడవి శేషు నటించిన సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు. ఇలా ఈయన కూడా తన తదుపరి చిత్రాల ద్వారా పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus