Adivi Sesh: ఫ్యాన్స్‌కు అడివి శేష్ రిక్వెస్ట్.. ఏంటంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో బయటకు వచ్చి సినిమాలను చూడలేని పరిస్థితి. ఈ శుక్రవారం నాడు విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ రెండు సినిమాలకు హిట్ టాక్ వచ్చింది. దీంతో టాలీవుడ్ లో సందడి నెలకొంది. ఇదే విషయాన్ని అడివి శేష్ చెప్పుకొచ్చారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి పాజిటివ్ రిపోర్ట్స్ వింటున్నానని.. చాలా సంతోషంగా ఉందని అన్నారు.

‘ఇది కదా కావాల్సింది.. కోవిడ్ వచ్చి ఐసో లేషన్‌లో ఉన్నా.. నా కోసం మార్నింగ్ షో ఒకటి.. మ్యాట్నీ ఒక సినిమా కుమ్మేయండి’ అంటూ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశారు. రీసెంట్ గా ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడివి శేష్ భారీ విజయాన్ని అందుకున్నారు. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇప్పుడు ‘హిట్ 2’ సినిమా కోసం రెడీ అవుతున్నారు అడివి శేష్. ఇంతలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విడుదలైన సినిమా గురించి స్పందించారు. కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’, ‘సీతారామం’ సినిమాలు ఓ మోస్తరు బజ్ తో విడుదలయ్యాయి. అలా విడుదలైన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ‘బింబిసార’ మొదటిరోజే యాభై శాతం రికవరీ చేసిందని టాక్. వీకెండ్ లో ఈ సినిమాలు సత్తా చాటడం ఖాయం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus