Adah Sharma: ప్రతి సినిమా చివరి సినిమా అనుకుంటూనే చేశాను: అదా శర్మ

అదా శర్మ.. ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడినప్పటికీ.. హీరోయిన్ గా అదా శర్మకి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా వల్ల టాలీవుడ్లో ఈమెకు మంచి ఆఫర్లే వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి బడా సినిమాల్లో ఈమె ఛాన్స్ కొట్టింది. కానీ ఆ సినిమాల్లో ఈమె పాత్రలు.. అంతంత మాత్రమే.

పెద్ద దర్శకులు కథా అని పాత్ర ఎలాంటిదో చూడకుండా ఈమె.. ఆ సినిమాలకు సైన్ చేసేసినట్టుంది. అందుకే తర్వాత ఈమెకు ఆఫర్లు కరువయ్యాయి. రాజశేఖర్ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి’ సినిమాలో నటించినా.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో.. ఆ సినిమా కూడా ఈమె ఆశలపై నీళ్లు జల్లినట్టు అయ్యింది. ‘క్షణం’ మూవీ హిట్ అయినా ఈమె పాత్ర ఆ సినిమాలో ఎక్కువ సేపు ఉండదు. ఆ తర్వాత అదా శర్మ అనే హీరోయిన్ ఉంది అనే విషయాన్ని కూడా జనాలు మర్చిపోయినట్టైంది.

అయితే ఇటీవల వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం (Adah Sharma) అదా శర్మకి మంచి సక్సెస్ అందించింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.150 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ క్రమంలో అదా శర్మ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. ‘నటిగా నాకు పెద్దగా కోరికలు అంటూ ఏమీ లేవు. నేను చేసిన ప్రతి సినిమా.. ఇదే నా చివరి సినిమా అనుకునే చేశాను.

ఎందుకంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుందో రాదో చెప్పలేం కాబట్టి.! అలాగే పెద్ద హీరోల సినిమాల్లో నటించాలి.. ఫేమ్ అవ్వాలి అనే కోరికలు కూడా ఇప్పుడు లేవు. 15 ఏళ్లకు నాకో మంచి సక్సెస్ వచ్చింది. అది చాలు” అంటూ ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus