అప్పుడు వెంకీ,చిరు.. ఇప్పుడు బన్నీ, మహేష్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యి.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. 3 వ వారంలోకి ఎంటరయినప్పటికీ ఈ చిత్రాలు ఇంకా జోరుని చూపిస్తూనే ఉన్నాయి. అయితే బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కంటే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బన్నీ సినిమా పక్కా ఫ్యామిలీ సినిమా అయితే మహేష్ బాబు ది పక్కా మాస్ సినిమా. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తారు అనడానికి ఇది నిదర్శనం.

గతంలో…అంటే 2000 వ సంవత్సరంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అప్పటి సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’.. అలాగే విక్టరీ వెంకటేష్ ల ‘కలిసుందాం రా’ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక మెగాస్టార్ ‘అన్నయ్య’ చిత్రం కాస్త ముందుగా విడుదలయ్యింది. ఓపెనింగ్స్ లో రికార్డులు సృష్టించింది.. తరువాత ‘కలిసుందాం రా’ చిత్రం వచ్చాక కాస్త కలెక్షన్లు తగ్గాయి.. కానీ మంచి కలెక్షన్లనే నమోదు చేసాయి. ‘అన్నయ్య’ చిత్రం అప్పటి రోజుల్లో 13 కోట్ల వరకూ కలెక్షన్స్ ని రాబడితే.. ‘కలిసుందాం రా’ చిత్రం 19 కోట్ల వరకూ కలెక్షన్లను నమోదు చేసింది. మళ్ళీ ఇన్నాళ్టికి ఇదే సీన్ బన్నీ, మహేష్ విషయంలో రిపీట్ అయ్యింది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus