నటసింహ నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకాభిమానులకు సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
బాలయ్యకీ, సంక్రాంతికీ అవినాభావ సంబంధం ఉంది.. నందమూరి నటసింహాన్ని ఇండస్ట్రీ వర్గాలవారు సంక్రాంతి సింహం అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయన కెరీర్లో పెద్ద పండగప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మెజారిటీ శాతం సూపర్ హిట్స్ అయ్యాయి. పైగా టైటిల్‌లో ‘సింహా’ ఉండంతో ఆ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ సినిమాలను చెప్పుకోవచ్చు.
‘లక్ష్మీ నరసింహా’, ‘జైసింహా’ చిత్రాల తర్వాత వస్తున్న ఈ ‘వీర సింహా రెడ్డి’ మీద అంచనాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలకుపైగా కెరీర్ కలిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 16 చిత్రాలు ఇప్పటివరకు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. అందులో జనవరి 12న కొన్ని రిలీజ్ అయ్యాయి.. సంవత్సరాలు వేరైనా ఒకేరోజు (12) వచ్చిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
1. ప్రాణానికి ప్రాణం – 12 జనవరి 1990
నందమూరి బాలకృష్ణ – రజినీ జంటగా.. స్టార్ డైరెక్టర్ ఎ. కోదండ రామి రెడ్డి డైరెక్ట్ చేసిన ‘ప్రాణానికి ప్రాణం’ జనవరి 12న విడుదలైంది.. బాలయ్య నటించిన 49వ సినిమా ఇది.. తర్వాత 50వ సినిమా (నారీ నారీ నడుమ మురారి) కూడా కోదండ రామి రెడ్డితోనే చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు..
2. పరమవీర చక్ర – 12 జనవరి 2011
దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే జనవరి 12న దర్శకరత్న దాసరి నారాయణ రావుతో చేసిన ఫస్ట్ పిక్చర్ ‘పరమవీర చక్ర’ రిలీజ్ అయింది..
3. గౌతమిపుత్ర శాతకర్ణి – 12 జనవరి 2017
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటసింహ చేసిన మొదటి సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. ఇది బాలయ్య 100వ సినిమా..
4. జై సింహా – 12 జనవరి 2018
శాతకర్ణి వచ్చిన సరిగ్గా సంవత్సరానికి అదే జనవరి 12న ‘జై సింహా’ తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు బాలయ్య బాబు..