Vikaram: ఆరేళ్ల తరువాత రీలీజ్ కాబోతున్న చియాన్ విక్రమ్ కొత్త సినిమా!

డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ అంటేనే లవ్ స్టోరీస్‌ స్పెషలిస్ట్. అలాంటి కథలకు యాక్షన్ మిక్స్ చేసి తెరకెక్కించడంలో ఆయన దిట్ట. సూర్యతో ‘కాక కాక’, కమల్ హాసన్‌తో ‘రాఘవన్’ లాంటి హిట్ చిత్రాలు రూపొందించింది తనే. ఇక చియాన్ విక్రమ్, గౌతమ్ ఇద్దరూ తమ కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే 2016లో ‘ధ్రువ నక్షత్రం’ మూవీని మొదలుపెట్టారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ మేకింగ్ మొదలవగా.. 2019లో దాదాపు షూటింగ్ మొత్తం అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉందని ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఆ మూవీ ఆర్థిక సమస్యలతో మూలనపడింది.

అయితే ఆరేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. చిత్రీకరణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో తాజా ఇంటర్వ్యూలో తెలిపారు గౌతమ్ధ్రు వ నక్షత్రం’పై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పిన గౌతమ్.. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ మూవీని జులై 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆలస్యానికి గల కారణాలు విశ్లేషిస్తూ.. ఆరేళ్ల కింద ఈ సినిమా కోసం తాను తప్పుడు వ్యక్తులతో పనిచేశానని, కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తాన్ని నిర్మాతగా తన చేతుల్లోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన గత నాలుగైదు నెలలుగా ఈ సినిమా రిలీజ్ కోసం రాత్రి, పగలు శ్రమిస్తున్నారు.

ఇక ఈ మూవీ ట్రైలర్ కూడా త్వరలోనే విడుదల కానుండగా.. గౌతమ్ మీనన్ నెక్ట్స్ డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. ఇక ధ్రువ నక్షత్రం చిత్రంలో రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, పార్థిబన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ కథానాయికలుగా నటిస్తున్న చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ 3.0 లైవ్ కాన్సర్ట్‌లో గౌతమ్ మీనన్ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది అప్పట్లో విక్రమ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో షూటింగ్ జరుపుకున్న స్పై థ్రిల్లర్ మూవీ.

అమెరికా, బల్గేరియా, జార్జియా, టర్కీ వంటి దేశాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో (Vikaram) చియాన్ విక్రమ్.. జాన్ అనే భారతీయ గూఢచారి పాత్రను పోషిస్తున్నారు. మారువేషంలో భారతదేశ జాతీయ భద్రతా సంస్థ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందానికి నాయకత్వం వహిస్తారు. ఇక గౌతమ్ మీనన్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. శింబుతో గతంలో రూపొందించిన ‘వెందు తనిందతు కాడు’ మూవీకి సీక్వెల్ చేయనున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు ధృవీకరించలేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus