కుటుంబం, వినోదం, మాస్ ఎలిమెంట్స్‌ను పక్కాగా మేళవించి సినిమాలు తీయడంలో దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి దిట్ట అని చెప్పొచ్చు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ అలరించారు ఆయన. 2010 వరకు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత కాస్త వెనుకబడ్డారు. అయితే 2014లో ‘యమలీల 2’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఆ సినిమా దారుణ ఫలితం అందించింది. దీంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. ఇప్పుడు అంటే ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ‘యాక్షన్.. కట్..’ చెప్పబోతున్నారు.
అవును, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. సుదీర్ఘ విరామానికి పుల్‌స్టాప్ పెట్టి కొత్త చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు’ అనే వైవిధ్యభరితమైన టైటిల్‌ను సినిమాకు ఖరారు చేశారు కూడా. బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అనన్య కథానాయికగా నటిస్తుండగా ఖుష్బూ, అలీ, సునీల్, వరుణ్‌సందేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు’ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
చాలా ఏళ్ల తర్వాత కొత్త సినిమా చేస్తున్నాను. చాలామంది నా మార్క్ కామెడీ చిత్రాలు రావడం లేదంటున్నారు. నాకూ అదే అనిపించింది. అప్పటి నుండి కథలు రాసుకుంటూ సరైన నిర్మాత కోసం ఎదురు చూశాను అని చెప్పారు ఎస్వీ కృష్ణా రెడ్డి. చాలాకాలం తర్వాత మళ్లీ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది అని చెప్పారు రాజేంద్రప్రసాద్. ఎస్వీ కృష్ణారెడ్డి నుండి సినిమా అంటే ఓ స్టైల్ ఆఫ్ కామెడీ అని చెప్పొచ్చు.
ఓల్డ్ ఈజ్ గోల్డే కానీ. మరీ ఓల్డ్ అయితే కష్టమే. అందుకే ఇప్పటితరం కామెడీ, యువత ఆలోచనలకు ఆయన స్టైల్‌ను మిక్స్ చేసి సినిమా చేయాలి. లేదంటే కుర్రకారును ఆకట్టుకోవడం కష్టమే. అయతే సోహైల్ లాంటి ఎనర్జిటిక్ యాక్టర్, రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ యాక్టర్‌ను కలిపి సినిమా చేస్తే ఆకట్టుకునే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ ఎస్వీ కృష్ణారెడ్డి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!