నటిని బెదిరిస్తోన్న బిజినెస్‌మెన్‌ అరెస్ట్!

ప్రముఖ బంగ్లాదేశ్ నటి పోరి మోని ఓ వ్యాపారవేత్త తనపై అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించారంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఆమె పెట్టిన పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది. ఈ ఆపద నుండి తనను ఎలాగైనా కాపాడాలంటూ దేశ ప్రధాని షేక్ హసీనాను కోరింది. ఆమెను తల్లిగా సంభోదిస్తూ నిందితులపై చర్యలు తీసుకోమని కోరింది. నాలుగు రోజులుగా న్యాయం కోసం తిరుగుతున్నానని.. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది పోరి మోని.

న్యాయం కోసం ఎక్కడని వెతకాలంటూ ప్రశ్నించింది. ”నేను అమ్మాయిని, నటిని. వీటన్నింటికన్నా ముందు నేనూ ఒక మనిషినే. ఇక నేను సైలెంట్‌గా ఉండలేను” అంటూ మండిపడింది. నాలుగు రోజుల క్రితం ఓ క్లబ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నజీర్‌ యు మహ్మూద్‌ తనపై అత్యాచారానికి యత్నించడంతో పాటు చంపుతామని బెదిరించాడని మోని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారవేత్త నజీర్ తో పాటు మరో నలుగురిని రైడ్ చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో వారంతా మద్యంతో పాటు డ్రగ్స్ సేవించారని అధికారులు మీడియాకు తెలిపారు. ఇక పోరి మోని కెరీర్ విషయానికొస్తే.. 2015లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె దాదాపు 24 సినిమాల్లో నటించింది. గతేడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus