ఒకే ఫ్యామిలీ నుండీ ఇద్దరు హీరోలు సినిమాల్లోకి అడుగుపెట్టడం అనేది కొత్త విషయం కాదు. కానీ ఆ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు మాత్రమే సక్సెస్ అయ్యారు తప్ప ఇద్దరూ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ఇది అన్నదమ్ముల గురించి చెబుతున్నది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. కానీ శ్రీకాంత్ తమ్ముడు అనిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు కానీ సక్సెస్ అవ్వలేదు.
అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ ఓ మోస్తరు సక్సెస్ లు అందుకున్నాడు. కానీ బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు లేవు. రానా తమ్ముడు అభి రామ్ అహింస ఫెయిల్ అయ్యింది. నాగ చైతన్య సక్సెస్ అయినట్టు అఖిల్ సక్సెస్ కాలేదు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్నా ఇంకా అతను తన పర్ఫార్మెన్స్ తో మెప్పించింది లేదు. అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాత్రం హీరోగా నిలబడ్డాడు. అతను నటించిన లేటెస్ట్ మూవీ బేబీ బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి పాత్ర బాగా వచ్చినా .. పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం ఆనంద్ దేవరకొండ పాత్రకే వచ్చాయి. అంతకు ముందు మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో కూడా ఆనంద్ తన నటనతో మెప్పించాడు. సో ఇలాంటి అమాయకపు పాత్రలకి అతను కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో చిరంజీవి – పవన్ తర్వాత సక్సెస్ అయిన అన్నదమ్ములు (Vijay) విజయ్ – ఆనంద్ లే అని చెప్పాలి.