టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు కాగా రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మహేష్ రాజమౌళి మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అయితే రాజమౌళి తర్వాత ఆ రేంజ్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగా పేరు సమాధానంగా వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.
అయితే ఈ సినిమా ద్వారా సందీప్ రెడ్డి ఫ్యామిలీకి ఏకంగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో లాభం దక్కింది. సందీప్ రెడ్డి వంగా తక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ షూటింగ్ మాత్రం వేగంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పిరిట్ మూవీలో ప్రభాస్ ను సైతం ఒకింత వైల్డ్ గా చూపించనున్నారని తెలుస్తోంది. స్పిరిట్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైన తర్వాతే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. స్పిరిట్ సినిమా కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు ఇతర భాషల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రిప్తీ డిమ్రీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
స్పిరిట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ఇకపై వరుస విజయాలను సొంతం చేసుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ సలార్ ప్రమోషన్స్ లో పాల్గొంటారో లేదో చూడాల్సి ఉంది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!