2018లో వచ్చిన ‘అరవింద సమేత’ తర్వాత దాదాపు 3 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్… ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో కొమరం భీమ్ గా అతను నట విశ్వరూపాన్ని చూపించాడు. డైరెక్టర్ రాజమౌళితో సినిమా అంటే అతను ఎంత జోష్ తో వర్క్ చేస్తాడో, ఎంత కాన్ఫిడెంట్ గా నటిస్తాడనేది మరోసారి ప్రూవ్ చేసాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో హీరోగా ఉన్నప్పటికీ అతనితో నిజజీవితంలో ఎలా కలిసుంటాడో..
అదే విధంగా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అభిమానులకి ఫుల్ మీల్స్ లా అనిపించింది.అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ మూవీ అలరించి రూ.1000 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్ళను రాబట్టింది. ఈ మూవీతో ఈ ఇద్దరి హీరోల ఇమేజ్ మరింతగా పెరిగింది. ముఖ్యంగా ‘కొమరం భీముడొ’ పాటలో ఎన్టీఆర్ నటనని చూసిన ప్రేక్షకులు అతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. ప్రతీ ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ, పక్కన రాష్ట్రాల ప్రమోషన్లకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ అన్ని భాషల్లోనూ మాట్లాడుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ డిమాండ్ బాగా పెరిగింది. పక్క రాష్ట్రాల్లోని దర్శకనిర్మాతలు కూడా అతనితో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నారు. దీంతో ఎన్టీఆర్ కూడా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకి రూ.45 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న ఎన్టీఆర్… ఇప్పుడు తన 30వ సినిమా కోసం ఏకంగా రూ.55 కోట్లు పుచ్చుకోబోతున్నట్లు టాక్ నడుస్తుంది.అంటే రూ.10 కోట్లు పెంచేసాడన్న మాట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 70 రోజులు కాల్ షీట్లు ఇచ్చాడట.కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!