Dil Raju: విజయ్ సినిమాతో.. దిల్ రాజు మరో బిజినెస్

నిర్మాతగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును అందుకున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో కూడా మార్కెట్ను పెంచుకోవాలి అని సిద్ధమవుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒక విధంగా దిల్ రాజు ఇటీవల కాలంలో పూర్తిగా పెద్ద హీరోలతోనే సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. RRR సినిమా తో మొత్తానికి ఆయన భారీ స్థాయిలో లాభాలను అయితే అందుకున్నారు.

డిస్ట్రిబ్యూటర్ జిక్ RRR సినిమాను నైజాం ఏరియాలో భారీ స్థాయిలో విడుదల చేసిన దిల్ రాజు ఆ సినిమాను హక్కులను దాదాపు 70 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేశారు. ఇక నైజాం ఏరియాలో సినిమా ఇప్పటికే 20 కోట్లకు పైగా లాభాలను అందించింది. అయితే సినిమా మరో 15 కోట్లు కూడా అందించే అవకాశం ఉంది. రాధే శ్యామ్ సినిమా తో ఎదుర్కొన్న నష్టాలను దిల్ రాజు RRR సినిమాతో బ్యాలెన్స్ చేయబోతున్నాడు.

ఇక రాజు తమిళ హీరో విజయ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇక అంతకంటే ముందు విజయ్ బెస్ట్ సినిమా తో దిల్ రాజు నైజాం ఏరియాలో బిజినెస్ చేయబోతున్నాడు. ఈ సినిమా హక్కులను 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన మాత్రమే కాకుండా సురేష్ బాబు ఏషియన్ ఐనిమాస్ సునీల్ నారంగ్ కూడా భాగస్వామ్యులుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక నైజాం ఏరియాలో మాత్రం దిల్ రాజు బీస్ట్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ సినిమా ఈనెల 13వ తేదీన విడుదల కాబోతోంది. పోటీగా KGF 2 ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఈ సినిమాతో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్గా ఏ స్థాయిలో లాభాలు అందుముంటాడో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus