ఈ ఏడాది సంక్రాంతి చిత్రాలలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో, మహేష్ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ రెండు చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ సాధించి మహేష్ , బన్నీ కెరీర్ బెస్ట్ కల్లెక్షన్స్ సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ఇక సంక్రాంతి తరువాత విడుదలైన చాలా సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. దీనితో ఇంకా తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో ప్రదర్శించబడుతున్నాయి. గత వారం విడుదలైన భీష్మ మళ్ళీ బాక్సాఫీస్ కి శోభ తీసుకువచ్చింది.
దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మొదటిషో నుండే పాజిటివ్ టాక్ తో నడిచింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో సైతం ఈ చిత్రం అంచనాలకు మించిన వసూళ్లు రాబట్టింది. వీకెండ్ ముగిసేనాటికి పెట్టుబడిలో 75% పైగా రికవరీ చేసింది. భీష్మ థియరిటికల్ రైట్స్ 19-20 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాలలో అమ్ముడు కాగా ఇప్పటికే ఈ చిత్రం 17-18 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రేపటి నుండి వీకెండ్ మొదలుకానుంది. దీనితో ఈ వీకెండ్ ముగిసే నాటికి భీష్మ లాభాలు మొదలుకావడం ఖాయం. ఇక ఈ వారం ‘హిట్’ మినహా జనాలకు తెలిసిన సినిమా ఒక్కటి కూడా లేదు. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఆ చిత్రం భీష్మకు ఏమాత్రం పోటీకాదు. కాబట్టి ఈ వారం కూడా భీష్మ కుమ్మేయడం ఖాయం.
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!