Keeravani: చాలా రోజుల తర్వాత సీనియర్‌ స్టార్‌ హీరోలతో కీరవాణి.. ఏ సినిమాలంటే?

కీరవాణి… ఇప్పుడంటే రాజమౌళి సినిమాలకు అధిక ప్రాధాన్యం, మిగిలిన సన్నిహితుల సినిమాల తదుపరి ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఆయన సినిమాలు దాదాపు స్టార్‌ హీరోలతోనే ఉండేవి. అయితే రాజమౌళి పాన్‌ ఇండియా సినిమాలతో స్వింగ్‌లోకి వచ్చాక ఎక్కువగా ఆయన సినిమాలకే చేస్తున్నారు. అలాంటి కీరవాణి ఇప్పుడు ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలను ఒకేసారి చేయబోతున్నారు అని టాక్‌ వినిపిస్తోంది. అందులో సీనియర్‌ స్టార్‌ హీరోల సినిమాలు. ‘ఘోస్ట్’ సినిమా తర్వాత కొంత బ్రేక్ తీసుకుని నాగార్జున తర్వలో 99వ సినిమా స్టార్ట్‌ చేస్తారు అని టాక్‌.

ఈ సినిమా దర్శకుడు విషయంలో ఏవేవో డౌట్స్‌ ఉన్నాయి. అవన్నీ 29న క్లియర్‌ అవుతాయి అంటున్నారు. దర్శకుడు, కథ.. ఇలా చాలా డౌట్స్‌ ఉన్నాయి అనుకోండి. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కీరవాణి చేస్తారు అని సమాచారం. ఒకవేళ ఇది జరిగితే ఇద్దరూ మళ్లీ ఏడేళ్ల తర్వాత కలసి పని చేస్తున్నట్లు అనుకోవచ్చు. ఆఖరిగా నాగ్‌ – కీరవాణి ‘ఓం నమో వేంకటేశాయ’ చేశారు. ఇక మరో సీనియర్‌ స్టార్‌ హీరో చిరంజీవి. అవును చిరు సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తారట.

‘బింబిసార’ ఫేమ్‌ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్‌ అందిస్తారు అని అంటున్నారు. ఇది జరిగితే 28 ఏళ్ల తర్వాత కలసి పని చేయడం అన్నమాట. గతంలో ఆఖరిగా ఇద్దరూ ‘ఎస్పీ పరశురాం’ స్టేషన్‌ సినిమాకు పని చేశారు. పూర్తిగా సోషియో ఫాంటసీలో రూపొందనున్న ఈ సినిమాకు కీరవాణి (Keeravani) మ్యూజిక్ హైలైట్‌ అవుతుంది అంటున్నారు.

చిరు పుట్టిన రోజు సందర్భంగా సినిమాల పోస్టర్లు విడుదల చేస్తే అందులో సమాచారం వచ్చే అవకాశం ఉంది. మరి చేస్తారా? సమాచారం ఉంటుందా అనేది తెలియాలి. ఒకవేళ ఇప్పుడు లేదంటే వినాయకచవితికి అయినా సమాచారం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus