జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో పొలిటికల్ ప్రచారానికే పరిమితం కాగా ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరోవైపు పవన్ అన్నా లెజినోవా మధ్య ఏజ్ గ్యాప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ వయస్సు 55 సంవత్సరాలు కాగా అన్నా లెజినోవా వయస్సు 44 సంవత్సరాలు అని తెలుస్తోంది.
ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 11 సంవత్సరాలు అని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. అయితే పవన్, అన్నా లెజినోవా జోడీ బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోని పవన్ ఈ ఎన్నికల్లో మాత్రం మెరుగైన ఫలితాలను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. పవన్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఓజీ (OG Movie) సినిమా సెప్టెంబర్ నెల 27వ తేదీన విడుదల కావాల్సి ఉన్నా ఈ సినిమా ఆ తేదీకి విడుదల కావడం కష్టమని తెలుస్తోంది.
ఆ తేదీకి ఈ సినిమాకు బదులుగా గేమ్ ఛేంజర్ (Game changer) విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఓజీ మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కూడా కొంతకాలం పాటు పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే కొత్త సినిమాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే లేవనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.