Ravi Teja: కొత్త సినిమాకు ఓకే చెప్పేసిన రవితేజ… హీరోయిన్‌ ఆమెనా?

కెరీర్‌లో చేసిన తొలి సినిమా విజయం సాధిస్తేనే ఆ హీరోయిన్‌కు వరుస అవకాశాలు వస్తాయి అనుకుంటారు. అయితే అంతగా ఆడకపోయినా… ఆ తర్వాత వరుస ఛాన్స్‌లు అందుకుంటున్న కథానాయికలు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో సాక్షి వైద్య ఒకరు. అఖిల్‌ ‘ఏజెంట్‌’ తో తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ… ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటోంది. తాజాగా రవితేజతో ఓ సినిమా సైన్‌ చేసింది అని చెబుతున్నారు. అందం, అభినయం ఉన్న సాక్షికి వరుస ఛాన్స్‌లు వస్తాయనే విషయం తొలి సినిమాలో చూడగానే జనాలు పట్టేశారు.

ఇప్పుడు అదే జరుగుతోంది. అని చెప్పాలి. ‘ఏజెంట్‌’ సినిమా సెట్స్‌ మీద ఉండగానే రెండో సినిమా ఛాన్స్‌ సంపాదించింది సాక్షి వైద్య. వరుణ్‌ తేజ్‌తో ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ లోపు వరుసగా మూడు సినిమాలు ఓకే చేసేసింది. దీంతో రీల్స్‌ హీరోయిన్‌ బిజీ అయిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్‌’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా రాకముందే సాక్షికి మరో సినిమా వచ్చేసింది. గతంలో పుకారు వచ్చినట్లుగానే మాస్‌ మహారాజా సినిమాకు సైన్‌ చేసేసింది అని చెబుతున్నారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాతో బిజీగా ఉన్న (Ravi Teja) రవితేజ ఆ తర్వాత అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమా చేస్తారని టాక్‌. ఇందులోనే సాక్షి వైద్య ఖరారైనట్టు తెలిసింది. ‘జాతిరత్నాలు’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అనుదీప్‌.

ఈసారి కూడా కామెడీకి పెద్ద పీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మరో హీరో కూడా ఉంటారు అని అంటున్నారు. ‘జాతి రత్నాలు’ సినిమా తర్వాత అనుదీప్‌ ‘ప్రిన్స్‌’ అనే తమిళ సినిమా చేశారు. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. శివకార్తికేయన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా సరైన విజయం అందుకోకపోయినా నవ్వులు అయితే పంచింది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus