Akhil: హీరో అఖిల్ కెరీర్ ఏజెంట్ మూవీపై ఆధారపడిందా?

  • April 7, 2023 / 07:24 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతాడని అఖిల్ గురించి అందరూ భావించగా హీరో అఖిల్ కెరీర్ మాత్రం ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని అఖిల్ అనుకుంటున్నారు. ఏజెంట్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ మధ్య కాలంలో ఏ సినిమాపై రాని స్థాయిలో ఈ సినిమాపై గాసిప్స్ రావడం గమనార్హం. ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటడంతో నిర్మాత అనిల్ సుంకర తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. అఖిల్ ఈ సినిమా కోసం తన లుక్ ను సైతం మార్చుకున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ తాజాగా మొదలయ్యాయి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలవుతోంది.

ఇతర భాషల్లో కూడా ఏజెంట్ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం అఖిల్ (Akhil) మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. లిరికల్ వీడియోస్ తో ఈ సినిమా ప్రచారం మొదలు కాగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ పై అఖిల్ ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుందని చెప్పవచ్చు.

ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమా సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. అక్కినేని అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ ఆశల్ని ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాలి. అక్కినేని అఖిల్ పాన్ ఇండియా స్టార్ కావాలని అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా హీరోయిన్ సాక్షి వైద్య నటించడం గమనార్హం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus