ఫన్ ఫిల్ ఎంటర్టైనర్ గా అహ నా పెళ్ళంట.. రేపటి నుండే జీ5 లో స్ట్రీమింగ్!

రాజ్ తరుణ్ హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా హర్ష వర్ధన్, ఆమని కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ అహ నా పెళ్ళంట. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ రేపటి నుండీ అంటే నవంబర్ 17 నుండీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. తమడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బొర్రా.. సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు జీ5 వారు కూడా సహ నిర్మాతలుగా వ్యవహరించారు.

ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, శివాని రాజశేఖర్ క్యూట్ లుక్స్ , హర్ష వర్ధన్ అలాగే హీరో ఫ్రెండ్స్ కామెడీ ట్రాక్స్ వంటివి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం గ్యారెంటీ అనే ఫీలింగ్ ను కలిగించాయి. ఇక ప్రోమోస్ అన్నీ ప్రామిసింగ్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి పెరిగింది.

8 ఎపిసోడ్ లు గా ఈ వెబ్ సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. అర్థరాత్రి 12 గంటల నుండి ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో ఫన్ కు హద్దు అదుపు ఉండదు ప్రేక్షకులకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని ఈ వెబ్ సిరీస్ బృందం ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ కు జుదా శాండీ సంగీతం అందించగా పవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. షేక్ దావూద్ జి ఈ వెబ్ సిరీస్ కు కథ, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus