మెగా అభిమానులకు ఆహా ఓటీటీ బంపర్ ఆఫర్.. ఏం జరిగిందంటే?

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా సినీ అభిమానులకు మరో తీపికబురు అందించింది. సాధారణంగా థియేటర్లలో సినిమాలు రీరిలీజ్ అవుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఆహా ఓటీటీ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. నవంబర్ 3వ తేదీన మగధీర సినిమాను, నవంబర్ 10వ తేదీన అతడు సినిమాను, నవంబర్ 17వ తేదీన ఘరానా మొగుడు సినిమాను ఆహా ఓటీటీ రీ రిలీజ్ చేస్తుండటం గమనార్హం.

ఈ సినిమాలను ప్రీమియం క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నట్టు ఆహా ఓటీటీ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఇతర ఓటీటీలు సైతం ఆహా దారిలో నడుస్తాయేమో చూడాల్సి ఉంది. “సినిమా రిలీజులు థియేటర్లలోనే ఉంటాయా ఏంటీ? మా ఓటీటీలోనూ దింపుతున్నాం” అంటూ ప్రకటన చేసి ఆహా ఓటీటీ అభిమానులకు శుభవార్త చెప్పింది. పాత సినిమాలను ప్రీమియం క్వాలిటీతో చూడాలని చాలామంది భావిస్తున్నారు.

ఆహా (Aha) ఓటీటీ చేసిన పోస్ట్ కు 2000కు పైగా లైక్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలను ఓటీటీలో రీ రిలీజ్ చేయడానికి ఆహా ఓటీటీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీకి ఈ సినిమాల రీ రిలీజ్ లతో క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి. మెగా ఫ్యాన్స్ కు మాత్రం ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఆహా ఓటీటీ ఇతర భాషలపై కూడా దృష్టి పెడుతుండటం గమనార్హం.

ఆహా ఓటీటీ చేసిన పోస్ట్ గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మగధీర సినిమాను థియేటర్ లో రీ రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీలో రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. ఆహా ఓటీటీ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తే ఆహా రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus