Aishwarya Rai, Abhishek Bachchan: అంబానీ పెళ్లిలో స్టార్‌ కపుల్‌ మ్యారేజ్‌పై క్లారిటీ ఇచ్చేశారా? అలా రావడంతో…

ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai) – అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) విడిపోతున్నారా? విడిపోయారా? గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి క్లారిటీ ఇవ్వాల్సినవాళ్లు సరైన స్పష్టత ఇవ్వడం లేదు. అలా ఇవ్వకపోగా ఇంకొంచెం డౌట్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దీనికి అనంత్‌ అంబానీ – రాధిక మర్చంట్‌ల వివాహమే దీనికి వేదికగా మారింది. పెళ్లి తర్వాత రోజు అంబానీలు సెలబ్రిటీలకు రిసెప్షన్‌ ఇచ్చారు. దానికి అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీ కూడా హాజరైంది. అయితే అందులో ఐశ్వర్య రాయ్‌ కనిపించలేదు.

అయితే, అలా అని ఐశ్వర్య రాలేదా అంటే వచ్చింది. కూతురు ఆరాద్య కలసి ఐశ్వర్య కార్యక్రమానికి విచ్చేసింది. మొత్తం కుటుంబం కలసి ఒకేసారి వచ్చి, ఫొటోలకు పోజులిచ్చి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. అమితాబ్‌ (Amitabh Bachchan)  , జయ, అభిషేక్‌, నవ్య, ఆమె పిల్లలుగా ఓసారి రాగా, ఆ తర్వాత కాసేపటికి ఆరాధ్యతో కలసి ఐశ్వర్య వచ్చింది. దీంతో ఇద్దరూ విడిపోతున్నారనే పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. గతంలో రూమర్ల తర్వాత కూడా అభిషేక్‌, ఐశ్వర్య కలసి కనిపించారు.

అమితాబ్‌ ఫ్యామిలీతో ఐశ్వర్య కనిపించింది కూడా. దీంతో అప్పుడు ఆ రూమర్లకి చెక్‌ పెట్టింది. అయితే ఇటీవల కాలంలో అభిషేక్‌ – ఐశ్వర్య మళ్లీ కలసి కనిపించలేదు. దీంతోనే విడాకుల పుకార్లు బయటకు వచ్చాయి. ఆమె ఏకంగా వేరే ఇంట్లో ఉంటోంది అని కూడా వార్తలొస్తున్నాయి. వాటిపై క్లారిటీ వస్తుందేమో అనుకుంటే.. ఇలా వేర్వేరుగా వచ్చి ఆజ్యం పోసినట్లు అయింది. అయితే ఇక్కడో విషయం ఏంటంటే.. రిసెప్షన్‌ సమయంలో పక్కపక్కనే కూర్చున్నారు కానీ మాట్లాడుకోలేదు.

ఐశ్వర్య.. అభిషేక్‌ బచ్చన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2007లో వీరి వివాహం జరగ్గా.. వీరికి ఆరాద్య అనే అమ్మాయి జన్మించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే అవి సెలక్టివ్‌గా ఎంచుకుంటోంది. చివరగా ఐశ్వర్య ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan: II) సినిమాలో నటించింది. ఆ తర్వాత వివిధ సినిమాల పేర్లు చర్చలోకి వచ్చినా ఇంకా ఏదీ ఓకే చేయలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus