Aishwarya Rai: 300 మంది డాన్సర్లతో 25 రోజులు ఐశ్వర్యను కష్టపెట్టిన మణిరత్నం?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ మణిరత్నం గారు ఒకరు. ఈయనతో సినిమా చేయడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా చేసే అవకాశం వచ్చింది అంటే అదొక అదృష్టంగా భావిస్తారు. ఇకపోతే విక్రమ్ ఐశ్వర్యరాయ్ త్రిష ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్‌ అనే హిస్టారికల్ ఫిక్షన్ నావెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మణిరత్నం ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 30 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాల విడుదల తేదీ దగ్గర పడటంతో శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం మణిరత్నం భారీగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఏకంగా 300 మంది డాన్సర్లతో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది.300 మంది డాన్సర్లతో 25 రోజుల పాటు రిహార్సల్స్ చేయించి ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఇకపోతే ఈ పాటలో ఐశ్వర్యరాయ్ త్రిష కూడా డాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం త్రిష ఐశ్వర్య రాయ్ కూడా పాతిక రోజులపాటు రిహార్సల్స్ చేసి ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.ఇలా ఈ పాట గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు

కానీ మణిరత్నం పాట కోసం 25 రోజుల సమయం తీసుకోవడంతో అందరూ ఈయనను మరో జక్కన అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరు సినిమా చేస్తే ప్రతి ఒక్క విషయంలోనూ, చిన్న సన్నివేశంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 30 తేదీ విడుదల కావడంతో శరవేగంగా పనులను పూర్తి చేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus