Aaradhya: ఐశ్వర్య కూతురు ఆరాధ్యలో ఆ హీరోయిన్ పోలికలు.. ఆశ్చర్యపోయేలా?

ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా సత్తా చాటుతున్న ఐశ్వర్యారాయ్ పొన్నియిన్ సెల్వన్ సిరీస్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. 5 పదుల వయస్సులో కూడా అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మాయ చేయడం ఐశ్వర్యారాయ్ కే సాధ్యమైంది. ఐశ్వర్యారాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్యకు కూడా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆరాధ్య బచ్చన్ స్టేజ్ పర్ఫామెన్స్ ఇచ్చారు.

ఈ పర్ఫామెన్స్ చూసిన నెటిజన్లు ఆరాధ్య బచ్చన్ ను చూస్తే సినీ నటి సౌందర్య గుర్తుకు వస్తున్నారని చెబుతున్నారు. ఆరాధ్య ఎక్స్ ప్రెషన్లు సైతం సౌందర్యలా ఉన్నాయని మరి కొందరు చెబుతున్నారు. ఆరాధ్య సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవుతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ కామెంట్ల గురించి ఆరాధ్య నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. ఆరాధ్య (Aaradhya) స్టేజ్ పర్ఫామెన్స్ ను చూసిన ఐశ్వర్యా రాయ్ తెగ మురిసిపోయారు.

విడాకుల వార్తలకు ఐశ్వర్యా రాయ్ తాజాగా చెక్ పెట్టారు. భర్త, మామతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఆమె పంచుకున్నారు. ఐశ్వర్యా రాయ్ గురించి ఇలాంటి నెగిటివ్ వార్తలు రావడం తొలిసారి కాదు. అభిషేక్ కెరీర్ పరంగా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఐశ్వర్యా రాయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఇన్ స్టాగ్రామ్ లో ఐశ్వర్యా రాయ్ ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

ఐశ్వర్యా రాయ్ తెలుగులో కూడా నటించాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. ఐశ్వర్యారాయ్ పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఐశ్వర్యా రాయ్ ఆస్తుల విలువ 776 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus