RX 100, మంగళవారం.. ఈ రెండు హిట్ల తర్వాత అజయ్ భూపతి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ‘మంగళవారం’ వచ్చి ఏడాది దాటినా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇలాంటి టైమ్‌లో, “అతి త్వరలో ‘ట్రిగ్గరింగ్’ అప్డేట్ ” అంటూ గన్, హార్ట్, ఫైర్ ఎమోజీలతో ఆయన వదిలిన ట్వీట్, ఇప్పుడు ఫ్యాన్స్‌ను కొత్త కన్‌ఫ్యూజన్‌లో పడేసింది.
అసలు ఈ “ట్రిగ్గరింగ్” అనౌన్స్‌మెంట్ ఏంటి? ఇది కొత్త కథా? లేక ‘మంగళవారం’ సీక్వెలా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ‘మంగళవారం’ సినిమాను అజయ్ భూపతి ఒక సీక్వెల్‌కు స్కోప్ ఉండేలాగే ముగించాడు. ఆ సినిమాలోని డార్క్ థీమ్, వయొలెన్స్‌కు ‘గన్’, ‘ఫైర్’ ఎమోజీలు సరిగ్గా సరిపోతాయి.
కానీ, ‘హార్ట్’ (ప్రేమ) ఎమోజీ కొత్త డౌట్ రేపుతోంది. ‘మంగళవారం’ ఒక సస్పెన్స్ థ్రిల్లర్, అందులో లవ్ స్టోరీకి స్కోప్ ఉన్నా కూడా అదేమి అంతగా హైలెట్ కాలేదు. అదే ‘RX 100’ పూర్తిగా ఒక వయొలెంట్ లవ్ స్టోరీ. ఇప్పుడు అజయ్ పెట్టిన ఎమోజీలు (గన్ + హార్ట్ + ఫైర్) చూస్తుంటే, ఇది ‘మంగళవారం 2’ కంటే, ‘RX 100 2.0’ లాంటి మరో కొత్త, రా లవ్ స్టోరీ అయ్యే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తోంది.

మహాసముద్రం ఫ్లాప్ తర్వాత మంగళవారంతో హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు తన నాలుగో సినిమా కోసం, హిట్ అయిన ‘మంగళవారం’కు సీక్వెల్ తీసి సేఫ్ గేమ్ ఆడతాడా? లేక ‘RX 100’ లాంటి మరో బోల్డ్, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో రిస్క్ తీసుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతానికి, అజయ్ భూపతి కావాలనే ఈ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఆయన ట్వీట్ ఫ్యాన్స్‌ను రెండుగా చీల్చింది. కొందరు ‘మంగళవారం 2’ అంటుంటే, మరికొందరు ‘మరో రా లవ్ స్టోరీ’ అని గెస్ చేస్తున్నారు. ఇక ‘ట్రిగ్గరింగ్’ ప్రకటన వస్తే గానీ ఈ సస్పెన్స్‌కు తెరపడదు. ఆ మధ్య బిగ్ స్టార్ ఫ్యామిలీ నుంచి పరిచయం కానున్న మరో యువ హీరోతో కూడా అజయ్ సినిమా చేస్తున్నట్లు రకరకాల రూమర్స్ వచ్చాయి. వాటిపై కూడా అజయ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
