ఏపీ టూరిజం ప్రచారకర్తలుగా బాలీవుడ్ నటులు!!
- April 12, 2016 / 02:06 PM ISTByFilmy Focus
ఆంధ్రప్రదేశ్ టూరిజం అంబాసిడర్స్ గా బాలీవుడ్ స్టార్స్ అజయ్‌దేవగణ్, కాజోల్ దంపతులు వ్యవహరించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం విజయవాడలోని సీఎం కార్యాలయంలో అజయ్‌దేవగణ్, కాజోల్ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ప్రచార కర్తలుగా పనిచేసేందుకు ఈ జంట స్వచ్ఛందంగా ముందుకొచ్చారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంటర్టైన్మెంట్, మీడియా, క్రియేటివ్ సిటీ ప్రాజెక్టు చేపట్టేందుకు అజయ్‌దేవగణ్ కొన్ని ప్రణాలికలు కూడా చంద్రబాబు ముందు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏపీ పర్యాటక రంగాన్ని దశదిశల వ్యాపింపజేయడానికి ఈ బాలీవుడ్ దంపతులు స్వచ్చందంగా ముందుకు రావడం అభినందిచాల్సిన విషయమే.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













