ఆసక్తి రేకెత్తిస్తున్న అజయ్‌ కొత్త సినిమా ట్రైలర్‌!

యముడు… చిత్ర గుప్త అని పిలవగానే పేద్ద టోపీ పెట్టుకుని, చేతిలో పుస్తకం పట్టుకుని కంగారుగా వచ్చేవాణ్ని చాలామందిని చూసుంటారు. కానీ సూటుబూటు వేసుకొని టిప్‌ టాప్‌గా ఉంటే చిత్రగుప్తుణ్ని చూశారా? అయితే ‘థ్యాంక్‌ గాడ్‌’ ట్రైలర్‌ చూడాల్సిందే. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. అజయ్‌ దేవగణ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందింది. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

అయాన్‌ కపూర్‌ (సిద్ధార్థ్‌ మల్హోత్రా) రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ కంగారుగా కారు డ్రైవ్‌ చేస్తుంటాడు. ఇంతలో బైకర్ అడ్డంగా రావడంతో కారు తప్పించబోయి యాక్సిడెంట్‌ అవుతుంది. కట్‌ చేస్తే.. ఓ కొత్త లోకంలోకి చేరుతాడు. అక్కడ సూటు, బూటు వేసుకున్న ఓ ఆజానుబాహుడు కనిపిస్తాడు. నేనెక్కడున్నా, మీరెవరు అని అయాన్‌ అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి చెప్పే సమాధానంతో అయానే కాదు.. మనం కూడా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే అతనే చిత్రగుప్తుడు.

చనిపోయిన వ్యక్తితో జీవితం గురించి అర్థమయ్యేలా చిత్రగుప్తుడు ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు అనేదే సినిమా. అయాన్‌ జీవితంలో చేసిన తప్పులేంటి, ఇతరులను పెట్టిన ఇబ్బందులేంటి అనేది సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోడ్రన్‌ చిత్రగుప్తుడుగా అజయ్ దేవగణ్‌ నటిస్తున్నాడు. ఈ మోడ్రన్‌ చిత్రగుప్తుడి తీరే వేరుగా ఉంటుంది. ఆయన లోకం అత్యాధునిక హంగులతో మెరిసిపోతోంది. ఇంద్రకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబరు 25న విడుదలవుతోంది.

అయాన్‌తో అజయ్‌ ఆడించిన ‘గేమ్‌ ఆఫ్‌ లైఫ్‌’ అనేదే సినిమాకు కీలకంగా ఉండనుంది. మరి ఆట ఏంటి? ఎలా సాగింది? సిద్ధార్థ్‌ తిరిగి బతికాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి అంటున్నారు. ఇటీవల కాలంలో సాధారణ సినిమాలు, బాలీవుడ్‌ మూస ఫార్ములాలు విజయం సాధించడం లేదు. మరి ఈ సినిమా ఏమేరకు విజయం అందుకుంటుందో చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పటికే బాయ్‌టెక్‌ ట్రెండ్‌ మొదలైంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus