కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ తెగింపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా విడుదల కాగా 3 కోట్ల రూపాయల టార్గెట్ తో రిలీజైన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. తొలిరోజు తెగింపు భారీగానే కలెక్షన్లను అందుకున్నా రెండో రోజు నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురు కావడం ఈ సినిమాకు మైనస్ అయిందని తెలుస్తోంది.
వాస్తవానికి చాలామంది తమిళ హీరోలతో పోల్చి చూస్తే అజిత్ కు తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే తెలుగు స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో తెగింపు సినిమా విడుదల కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల వల్ల తెగింపు సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కోల్పోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. తెగింపు సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
ఈ సినిమాకు కోటి రూపాయల రేంజ్ లో నష్టాలు వచ్చే అవకాశం ఉందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అజిత్ కథల ఎంపికలో మారాల్సి ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ సినిమాలన్నీ ఒకే విధంగా ఉంటున్నాయని భిన్నమైన కథలను అజిత్ ఎంచుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. నెగిటివ్ టాక్ రావడం కూడా తెగింపు సినిమాకు మైనస్ అయింది.
తమిళంలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా సినిమాకు అజిత్ మార్కెట్ తగ్గుతుందే తప్ప పెరగడం లేదు. అజిత్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. అజిత్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 80 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.