వీరాభిమానం దురాభిమానంగా మారిన వేళ.. లారీ నుండి దూకి ప్రాణాలు పోగొట్టుకున్న అజిత్ అభిమాని..!

స్టార్లకి అభిమానులు, వీరాభిమానులు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లకి అసోసియేషన్స్ ఉంటాయ్. సినిమా రిలీజ్ అప్పుడు, తమ ఫేవరెట్ యాక్టర్ బర్త్‌డే నాడు సేవా కార్యక్రమాలు చేయడం లాంటివి సాధారణంగా చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ అభిమానం హద్దులు దాటితేనే ఇబ్బంది. ఈ విషయంలో తమిళ నాడు వాళ్లతో పోలిస్తే మన తెలుగు హీరోల ఫ్యాన్స్ చాలా బెటర్.. కోలీవుడ్‌లో దళపతి విజయ్, తల అజిత్ ఇద్దరూ టాప్ స్టార్స్. ఇద్దరికీ సమానంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది.

ఇక ఈ హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. సినిమాల రిలీజ్ అప్పుడు వాళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో వీళ్ల మధ్య దారణమైన మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. అజిత్ ‘తునివు’ (తెగింపు), విజయ్ ‘వరిసు’ (వారసుడు) సంక్రాంతి కానుకగా జనవరి 11న బాక్సాఫీస్ బరిలోకి దిగాయి..‘వరిసు’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా.. ‘తునివు’ డిజాస్టర్ అంటున్నారు. తమిళనాట స్టార్ హీరోలైన అజిత్ – విజయ్ ఫ్యాన్స్ మిగతా హీరోల ఫ్యాన్స్ కంటే కాస్ డిఫరెంట్‌గా ఉంటారు.

ప్రాణాలు సైతం లెక్క చెయ్యని విధంగా చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఇది వరకు ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. కాగా ఇప్పుడు అత్యుత్సాహంతో అజిత్ అభిమాని ఒకతను ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని రోహిణి థియేటర్‌లో అర్థరాత్రి 1 గంటకు వేస్తున్న ‘తునివు’ స్పెషల్ షో చూడ్డానికి భరత్ కుమార్ అనే అజిత్ అభిమాని వచ్చాడు. ఒక్క క్షణం అతను అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే చక్కగా సినిమా చూసి ఆనందంగా తిరిగి వెళ్లేవాడు కానీ అలా జరగలేదు.

లారీలో వచ్చిన భరత్.. థియేటర్ దగ్గరకు వస్తుండగానే లారీ ఆగకముందే కిందకి దూకేశాడు. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అభిమానం ఉండొచ్చు కానీ ఇలా అత్యుత్సాహం మంచిది కాదంటూ.. భరత్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus