Ajith: అజిత్ కి చాలా సర్జరీలు జరిగాయి!

Advertisement

తమిళ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అజిత్ ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఈయనకు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇక అజిత్ కు సినిమాలంటే ఎంత ఇష్టమో అదే స్థాయిలో బైక్ రైడింగ్ అంటే కూడా చాలా ఇష్టం.తన సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని ఈయన బైక్ రైడింగ్ చేస్తూ పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఉంటారు.

ఈ విధంగా అభిమానుల కోసం సినిమాల కోసం (Ajith) అజిత్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు అనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా నటుడు అజిత్ గురించి నటుడు అబ్బాస్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినీ ఇండస్ట్రీ గురించి సెలబ్రిటీల గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నటువంటి అబ్బాస్ అజిత్ గురించి కూడా మాట్లాడారు. అజిత్ అచ్చం తనలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని తెలిపారు..

ఏ విషయాన్ని అయినా అబద్ధాలు చెప్పకుండా తనకు తోచిన విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలవాడని అజిత్ గురించి అబ్బాస్ తెలియజేశారు. అయితే అజిత్ సినిమా షూటింగ్లో భాగంగా ప్రమాదాలకు గురయ్యారు. అలాగే బైక్ రైడింగ్ చేస్తూ కూడా చాలాసార్లు ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు చాలా సర్జరీలు చేశారని తెలిపారు. ఈ విధంగా ఎక్కువగా అజిత్ సర్జరీలు చేయించుకోవడంతో ఆయన భవిష్యత్తులో పెరాలసిస్ వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్టు ఈ సందర్భంగా అజిత్ వెల్లడించారు.

తాను పెరాలసిస్ వ్యాధి బారిన పడతారని డాక్టర్లు చెప్పినప్పటికీ ఈయన సినిమాలపై ఇష్టంతో సినిమాలలో నటిస్తున్నారు అయితే ఈయన మాత్రం ఎప్పటికప్పుడు తన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారని అబ్బాస్ తెలిపారు. ఇలా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో అజిత్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags